-
బుల్లెట్లా దూసుకెళ్తాం..
-
వింటేజ్ షో అదిరింది..
ఖైరతాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లుంబినీ పార్క్‌లో ఏర్పాటుచేసిన వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంది. 1962 నుంచి ఇప్పటి 2004 వరకు మార్కెట్లోకి వచ్చిన మొత్తం 30 కార్లు, 60కి పైగా ద్విచక్రవాహనాలు శుక్రవారం ప్రదర్శనలో ఉంచారు. చవర్లెట్ కంపెనీ...ఆస్టిన్- మేడిన్ ఇంగ్లాండ్ 1952 నాటి ఆస్టిన్ - మేడిన్ ఇంగ్లాడ్ బైక్... రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన సైకిల్...రాజ్‌దూత్, హెచ్డి, బుల్లెట్, వెస్పా స్కూటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలచాయి. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆరువేల వింటేజ్ వాహనాలు ఉంటే తెలంగాణలోనే రెండువేల వాహనాలు ఉన్నాయన్నారు. 1952 నాటి నార్టన్ బైక్ (500సిసి)ను కమిషనర్ ఉత్సాహంగా నడిపారు. ఎంతో కాలం తర్వాత ద్విచక్రవాహనం నడిపే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. వింటేజ్ ప్రదర్శనలో 1952 మోడల్ చవర్లెట్ కంపెనీకి చెందిన స్టైల్ లైన్ డీలక్స్ - 6 సిలిండర్ ఇంజన్, 1936 మోడల్ ఆస్టిన్ -ఇంగ్లాండ్ మోడల్ కారు తండ్రి జ్ఞాపకార్థం తనకు ద క్కిందని మాధవరావు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఉపయోగించిన 1935 నాటి పోల్డబుల్ సైకిల్, 1973నాటి ప్యూజీ కంపెనీ మోటార్ సైకిల్, 1953 ఇంజన్ సైకిల్ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్‌తో పాటు నగరం నలు మూలల నుంచి విచ్చేసిన సందర్శకులు ఎంతో ఉత్సాహంగా వాహనాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement