-
జీవితం తీరూతెన్నూ మార్చిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటివరకు సాఫీగా సా గిన జీవనయానం ఇక ముందు అలాగే ఉండబోదు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు.. ఆ తరువాత రోజుల్లో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పొంతన ఉండదు. అందరి జీవితాల్లో ఎంతోకొంత మేర మార్పులు సహజం’ అంటున్నారు మానసిక నిపుణులు. వివిధ వర్గాలు ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, మనిషి ప్రవర్తన, సంబంధాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా 220 మందిని 21 అంశాలపై సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్, సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. కరోనాతో ముడిపడిన వివిధ అంశాలు, అవి చూపే ప్రభావాలు, వివిధ వర్గాల ప్రజల ఆలోచన తీరు, ఏయే విషయాల్లో మార్పులొస్తాయనే దానిపై అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను, దీనిపై తాము చేసిన విశ్లేషణలను వీరేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బతకాలంటే సవాళ్లు ఎదుర్కోవాల్సిందే.. కరోనాతో వ్యక్తిగత జీవితంలో, మనుషుల వైఖరుల్లో మార్పులొస్తాయి. ఆలోచనలు, ప్ర వర్తన, జీవనశైలి, అటవాట్లు మారతాయి. కు టుంబం, వ్యక్తులు, డబ్బు.. వీటి ప్రాధాన్యత మారుతుంది. వ్యక్తుల మధ్య సామాజికంగా, వ్యక్తిగతంగా మార్పులు తప్పవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సందర్భంలో, తదనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎవరికి వారు తమ పరిధుల్లో ఎదుర్కొనేందుకు తగిన పద్ధతులు, విధానాలను సిద్ధం చేసుకోవాలి. కనువిప్పు కలిగించింది.. కరోనా ప్రభావంతో ఎదురయ్యే ఒత్తిళ్లతో వివి ధ అంశాల్లో అనిశ్చితి చోటుచేసుకుంటుంది. వైవాహిక సంబంధాలు, విడాకులు వంటి వా టిపైనా కరోనా ప్రభావం పడింది. విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు వంటివి చేపట్టకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గడ్డు కాలంలోనూ మనుషుల్లో మానవత్వం వికసించింది. సమాజం చెడిపోయిందని నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి కరోనా సమయం కనువిప్పు కలిగించింది. -
నేనే చంపాను.. కాదు నేనే చంపాను!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మద్యం తాగి భార్యను రోజూ వేధిస్తున్న వీరేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం కూడా మద్యం తాగి వచ్చి గొడవచేయటంతో భార్య మిథిలేశ్, ముగ్గురు పిల్లలు కత్తితో తండ్రిపై దాడిచేశారు. దీంతో వీరేందర్ అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. వీరేందర్‌ను హత్యచేసింది నేనంటే నేనేనంటూ ముగ్గురు పిల్లలు, భార్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే.. స్థానికుల సమాచారం, బంధువుల విచారణ ఆధారంగా.. పెద్ద కుమారుడిని అరెస్టు చేశారు. -
వైద్యం వికటించి బాలిక మృతి
వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రసికంటి శైని(8) అనే బాలిక గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రులు చికిత్స నిమిత్త సిరిసిల్లలోని ప్రైవేట్ వైద్యుడు వీరేందర్ ఆర్.ఎమ్.పీ. వద్దకు తీసుకొచ్చారు. అతను పాపను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే బాలిక మృతిచెందడంతో.. బాలిక తల్లిదండ్రులు బంధువులు వైద్యం వికటించడం వల్లే బాలిక మృతిచెందిందని.. ఆందోళనకు దిగారు. -
పత్రాల లీక్ కేసులో ‘రక్షణ’ కార్మికుడు అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో అరెస్టయినవారి సంఖ్య 13కు చేరిం ది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్మికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చమురు శాఖలో పత్రాల లీక్‌లో కీలక నిందితుడికి అతను నకిలీ ఐడీ కార్డును అందించి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బొగ్గు, విద్యుత్ మంత్రి త్వ శాఖల్లోనూ పత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. పత్రాల లీకేజీలో రక్షణ శాఖలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న వీరేందర్‌కుమార్ నిందితులకు సహకరించి నట్లు పోలీసులు గుర్తించారు. ఇండియన్ డిఫె న్స్ అకౌంట్స్‌సర్వీస్ అధికారి ఐడీ కార్డును వీరేందర్ దొంగిలించి నకిలీ కార్డును తయారుచేసి నిందితులు లల్తా ప్రసాద్, రామ్‌కుమార్ కు ఇచ్చాడని, దాంతోపాటు రక్షణ శాఖ లెటర్‌హెడ్‌ను వాడుకుని వాళ్లు వివిధ శాఖల్లోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు చెప్పారు. కాగా కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ లోక్‌సభలో డిమాండ్ చేసింది. -
ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు. వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement