-
గన్ షాట్‌తో చనిపోయిన నటుడు.. హత్య ? ఆత్మహత్య ?
హాలీవుడ్ పాపులర్ టీవీ సిరీస్‌లలో ఒకటి 'ది వాకింగ్ డెడ్'. ఇందులో 'పెట్ జాంబీ'గా అద్భుతంగా నటించిన మోసెస్ జె. మోస్లీ అకాల మరణం చెందాడు. 31 ఏళ్ల మోసెస్ ఈ ఏడాది జనవరిలో మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు మోసెస్ తుపాకీ గాయం కారణంగా చనిపోయడని తెలిపారు. అయితే మోస్లీ ప్రమాదవశాత్తు మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను మరణించిన ప్రదేశంలో ఒక లేఖను కూడా పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు మోసెస్ జె. మోస్లీ మృతదేహాన్ని జార్జియాలోని ఓ పార్కింగ్ లాట్లో కనిపెట్టారు. మోసెస్ చనిపోయిన నెలకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ రావడం గమనార్హం. మోసెస్ మృతిపట్ల అవేరి సిస్టర్స్ ఎంటర్టైన్మెంట్ నివాళి అర్పించింది. తన అధికారిక ఫేస్బుక్ పేజీలో సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అనేక మంది సెలబ్రిటీలు మోసెస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మోసెస్ 'పెట్ జాంబీ' పాత్రలో మూడేళ్లు 'ది వాకింగ్ డెడ్' సిరీస్‌లో నటించాడు. వాచ్మెన్, టేల్స్, అమెరికన్ సోల్, క్వీన్ ఆఫ్ ది సౌత్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. అలాగే లూజ్ స్క్రూస్, అటాక్ ఆఫ్ ది సౌతెర్న్ ఫ్రైడ్ జాంబీస్, డాల్ మర్డర్ స్ప్రీ వంటి మూవీస్‌లలో అలరించాడు. మోసెస్ జె. మోస్లీ చివరిగా నటించిన హాంక్, డిసెండింగ్ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. -
ఈ వారం యు ట్యూబ్ హిట్స్
టేలర్ స్విఫ్ట్ - అవుటాప్ ది ఉడ్స్ నిడివి : 4 ని. 16 సె. హిట్స్ : 69,42,867 టేలర్ స్విఫ్ట్ అమెరికా అమ్మాయి. సింగర్. సాంగ్ రైటర్. పద్నాలుగేళ్లకే పాపులర్ అయిన స్విఫ్ట్.. ఇప్పుడు తన 26 వ యేట ‘అవుటాఫ్ ది ఉడ్స్’ అనే ఇంకో కొత్త వీడియోతో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ వీడియో డిసెంబర్ 31 విడుదలైంది. హిట్లు కోటికి చేరుకోబోతున్నాయి! ‘అప్పుడది చిన్న విషయంగా తోచింది కానీ, ఆలోచిస్తుంటే మనం తీసుకున్న ఫొటోలో నువ్వు నేను తప్ప మిగతా ప్రపంచమంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండిపోయింది’ అంటూ ఈ సాంగ్ మొదల వుతుంది. ది వాకింగ్ డెడ్ : ట్రైలర్ నిడివి : 29 సె. హిట్స్ : 31,77,421 అమెరికన్ టెలివిజన్ చానెల్ ఎ.ఎం.సి (అమెరికన్ మూవీ క్లాసిక్స్)లో ఫిబ్రవరి 14నుంచి ప్రారంభం కాబోతున్న టీవీ సీరియల్ ‘ది వాకింగ్ డెడ్’ ట్రైలర్ ఇది. 6 వ సీజన్లో 10 ఎపిసోడ్‌గా ఈ హారర్ డ్రామా మొదలవుతోంది. ‘ది వాకింగ్ డెడ్’ అనే కామిక్ సీరీస్ ఆధారంగా అదే పేరుతో 2010 నుంచి ప్రసారం అవుతోంది. విలయం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారి రిక్స్ గ్రిమ్స్ నాయకత్వంలో సురక్షితమైన నివాస ప్రదేశాన్ని అన్వేషించే పనిలో పడతారు. ఆ ప్రయత్నంలో వికృత మానవులతో వారు జరిపే పోరాట సన్నివేశాలకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అరెథా ఫ్రాంక్లిన్ : ఎ నేచురల్ ఉమన్ నిడివి : 4 ని. 16 సె. హిట్స్ : 65,13,073 అరెథా ఫ్రాంక్లిన్ (73) అమెరికన్ సింగర్, మ్యుజీషియన్. అంతే వయసున్న తన సహ గాయని కరోల్ కింగ్ గౌరవార్థం కెన్నెడీ సెంటర్లో అరెథా ఇచ్చిన కచేరి ఎంతలా మంత్ర ముగ్ధుల్ని చేసిందో ఈ వీడియోలో చూడొచ్చు. కచేరికి హాజరైన కరోల్.. అరెథా గొంతులోంచి తన పాట విని ఉద్వేగానికి లోనయ్యారు. ‘యు మేక్ మి ఫీల్ లైక్ ఎ నేచురల్ ఉమన్’ అంటూ అరెథా పాడిన ఆ పాటను 1967లో కరోల్ కింగ్ రాశారు. అప్పట్లో అరెథాకో అదో పెద్ద హిట్. ఆ గానామృతాన్ని మళ్లీ అనుభూతి చెందుతూ కచేరీకి హాజరైన ఒబామా కంట తడి పెట్టారు! మిరుథన్ : ట్రైలర్ నిడివి : 1 ని. 58 సె. హిట్స్ : 4,48,364 తమిళ్లో మొట్టమొదటిసారిగా వస్తున్న జాంబీ థ్రిల్లర్ మూవీ ‘మిరుథన్’ ట్రైలర్ డిసెంబర్ 31న విడుదలైంది. శక్తి సౌందర్ రాజన్ డెరైక్షన్‌లో జయం రవి, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. జాంబీ అంటే మతి స్థిమితం తప్పిన వ్యక్తి. అతడు సృష్టించే అల్లకల్లోలం నుంచి జయం రవి సిటీని కాపాడే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడా లేక ఒక పౌరుడిగా నటిస్తున్నాడా అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ బీభత్స, భయానక చిత్రంలో కాస్త రొమాన్స్ కూడా ఉన్నట్టు మాత్రం ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement