-
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024 -
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అర్థం చేసుకోరే?
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. అటు కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాతో పాటు ఇటు బాలీవుడ్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ కోసం తారక్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో తాజా షెడ్యూల్ కోసం మరోసారి ముంబై వెళ్లారు. హీరోను చూడగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఆయన స్టార్ హోటల్లో బస చేసేందుకు వెళ్తుంటే వెంబడించి వీడియో తీశారు.ఓయ్..ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న తారక్.. తనను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించి ఓయ్.. అని పిలుస్తూ తనను క్లిక్మనిపించొద్దని అభ్యర్థించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తారక్ ఎంతో సరదాగా ఉంటారు. ఆయనకు అంత ఈజీగా కోపమనేది రాదు. సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వార్ 2 కోసం కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తన మేకోవర్‌ను సైతం మార్చేశారు. ఇది అర్థం చేసుకోలేని కొందరు ఆయన అనుమతి కూడా తీసుకోకుండా తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో అలా చేయొద్దని తారక్ సదరు కెమెరామన్లను వారించారు. తన లుక్ లీక్ కావొద్దని ఆయన ఇంతలా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.వార్ 2 కోసంకాగా వార్ 2 కోసం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 60 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారు. తొలి భాగాన్ని మించిపోయేలా హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్లు ప్లాన్ చేస్తున్నారట! ఈ పోరాట సన్నివేశాలను ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేసినట్లు భోగట్టా! ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Total फ़िल्मी (@totalfilmii) చదవండి: బాలీవుడ్ ఎంట్రీ.. కీర్తి చూశారా? అప్పుడే ఎలా మారిపోయిందో!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement