-
గజం గాలిలో 25 కిలోల నీళ్లు..
మనకు నీళ్లు లేనిదే జీవితం గడవదు. భూమ్మీద మూడో వంతు నీళ్లే ఉన్నా.. మనం ఉన్నచోట కరువు ఉంటే మాత్రం బతుకు కష్టమే. ఉన్న నీళ్లలో చాలా వరకు సముద్రాల్లో, కొంతవరకు మంచు రూపంలో ఉన్నాయి. మనకు దిక్కయ్యే నీళ్లు చాలావరకు సరస్సులు, నదులు, ఇతర వనరుల్లోని నీళ్లే. అవీ వాతావరణం నుంచి వాన రూపంలో పడే నీళ్లే. మరి భూమ్మీద వాతావరణంలో మొత్తంగా ఎన్ని నీళ్లు ఉంటాయో, అంతా ఒక్కసారిగా వానలా కురిస్తే ఏమవుతుందో తెలుసా.. ఎక్కువ.. తక్కువ.. భూవాతావరణంలో నీళ్లన్నీ ఆవిరి, అతి సూక్ష్మమైన బిందువుల రూపంలో ఉంటాయి. మొత్తంగా భూమి అంతటా వాతావరణంలో నీళ్లు ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, పీడనం, ఇతర వాయువుల శాతం, సమీపంలో జల వనరులు, సముద్రమట్టంతో పోలిస్తే ఎత్తు వంటివాటికి అనుగుణంగా నీటి శాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగానే ఓ చోట ఎక్కువగా, మరోచోట తక్కువగా వానలు పడతాయి. - భూమిపైన వాతావరణం వందల కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్నా.. నీటి ఆవిరి గరిష్టంగా 16 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే చేరగలుగుతుంది. ఇందులోనే మొత్తంగా 138.6 కోట్ల ఘనపు కిలోమీటర్ల పరిమాణంలో నీళ్లు ఉన్నట్టు అమెరికా జియాలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) అంచనా వేసింది. - ఒక ఘనపు కిలోమీటర్ నీళ్లు అంటే.. కిలోమీటర్ పొడవు, వెడల్పుతో, కిలోమీటర్ లోతు ఉన్న సరస్సులో పట్టేటన్ని నీళ్లు అనుకోవచ్చు. మరి 138.6 కోట్ల కిలోమీటర్ల నీళ్లు అంటే వామ్మో అనిపిస్తుంది కదా.. భూమి అంతటా 3 సెం.మీ. వాన మరి వాతావరణంలోని నీళ్లన్నీ ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా వానలా కురిస్తే.. మొత్తం భూమి అంతటా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 3 సెం.మీ. అంటే తక్కువే అనిపించొచ్చు. కానీ అంతటా వాన అంటే.. అతిభారీ వరదలతో చాలా ప్రాంతాలు మునిగిపోయి, ఊహించలేని నష్టం జరుగుతుందని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఫాబ్రీ తెలిపారు. కిలోమీటర్ మేఘం 500 టన్నులు వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఒకచోట చేరి మేఘాలు గా మారుతుంది. ఆ మేఘాలు చల్లబడి వాన పడుతుంది. మరి గాల్లో తేలిపోతూ ఉండే ఆ మేఘాల బరువెంతో తెలుసా? అమెరికాలోని కొలరా డోలో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మార్గరెట్ లీమోన్ ఈ లెక్కను శాస్త్రీయంగా తేల్చారు. మేఘాల్లో ని నీటి ఆవిరి బరువు సగటున క్యూబిక్ మీటర్‌కు అర గ్రాము ఉంటుందని గుర్తించారు. ఒక క్యూబిక్ కిలోమీటర్ పరిమాణం ఉండే క్యుములో నింబస్ తరహా మేఘం బరువు ఏకంగా 500 మెట్రిక్ టన్నులుంటుందని తేల్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఓహయోలో రాళ్లవాన
వాన అంటే నింగి నుంచి నేలపైకి నీటిచినుకులు రాలిపడటమే కాదు, ఒక్కోసారి వడగళ్లు, అరుదుగా చేపలు, పీతలు వంటివి రాలిపడే ఉదంతాలూ ఉంటాయి. ఆకాశం నుంచి పిల్లులూ కుక్కలూ రాలిపడవు గానీ, ఇంగ్లిష్‌లో మాత్రం భారీ వర్షాన్ని ‘రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్’ అని అభివర్ణిస్తారు. అదో నుడికారం. పురాణాల్లో రాళ్ల వానల గురించిన వర్ణనలు మనకు తెలిసినవే. ఇంద్రుడికి కోపం వచ్చి రాళ్ల వాన కురిపిస్తే, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలిపై పెకైత్తి, నందుడి పరివారాన్నంతా కాపాడిన ఉదంతాన్ని భాగవతంలో వర్ణించారు. అయితే, అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో హ్యారిసన్విల్లె అనే పట్టణంలో 1901 అక్టోబర్ 13న నిజంగానే రాళ్లవాన మొదలైందట. అప్పట్లో ఒక స్థానిక పత్రిక ఈ విషయమై విపులంగా ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఉన్నట్లుండి పైనుంచి రాళ్లు పడుతుండటంతో జనాలు భయభ్రాంతులయ్యారు. ఎవరైనా ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారేమోనని అనుమానించారు. కొన్నాళ్లకు ఈ రాళ్లవాన దానంతట అదే ఆగిపోయింది. అయితే, దీనికి కారణాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది జరిగిన కొన్నేళ్లకు 1928లో ఇండోనేసియాలోనూ ఇలాంటి రాళ్లవానే కురిసింది. - కూర్పు: పన్యాల జగన్నాథదాసు
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- మరో ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement