-
నాల్గవ రోజు 194 కూల్చివేతలు
- 646కు చేరిన ఆక్రమణల తొలగింపు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువులు, నాలాలపై ఆక్రమణల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు గురువారం సుమారు 194 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నాలుగు రోజులు కలిపి ఆక్రమణల తొలగింపు సంఖ్య 646కు చేరింది. గురువారం కూల్చివేతకు గురైన వాటిలో చెరువులు, నాలాలపై ఉన్న 142 కట్టడాలు, అనుమతి లేని 27 కట్టడాలు, శిథిలావస్థకు గురైన 25 కట్టడాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు ఒక రోజు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం ఉదయం అక్రమ కట్టడాల కూల్చివేతలు యథాతథంగా కొనసాగనున్నాయి. -
సమస్యల వలయంలో మాయికోడ్
మంచినీటి పంపులకు మరమ్మతులు కరువు లోపించిన పారుశుద్ధ్యం.. పటించుకోని అధికారులు మనూరు: మండలంలోని మాయికోడ్‌లో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో 1,997 జనాభా ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం 5 మంచినీటి బోర్లు వేశారు. బోరు మోటార్లు కాలిపోయాయి. ఈ సమస్యకు తోడు మంజీరా నీరు రావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మండల అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. సర్పంచ్‌కు కూడా తమ బాధలు పట్టడం లేదన్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదు. ఈ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో తామే స్వచ్ఛందంగా దీపాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. కాలువల్లో మురుగు పేరుకుపోయింది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. చిన్నపాటి వర్షానికే ఊరంతా చిత్తడిగా మారుతోంది. ఫలితంగా దోమద బెడద ఎక్కువ అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి తమ సమ్యలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ తీరు సరికాదు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సిన సర్పంచ్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ నిధులును తమ సొంత అవసరాలకు వాడుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారుల తీరు కూడా సరిగ్గా లేదు. సమస్యలను వారు కూడా పట్టించుకోవడం లేదు. - అరుణ్, సీపీఎం నాయకులు, మాయికోడ్ నీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజూ బిందెలతో పొలాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఊర్లో ఐదారు బోర్లు ఉన్నా అవి పని చేయడం లేదు. బాధలు పట్టించుకునే నాధులే లేరు. - నాగమ్మ, మాయికోడ్ ప్రజల బాధలు చూడలేక.. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు చూడలేక తన బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నా. నీటి సమస్య తీవ్రత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. - పోతురాజు బాలయ్య నిధుల కొరతే కారణం గ్రామంలో సమస్యలు ఉన్న విసయం నిజమే. పంచాయతీకి నిధుల కొరత ఉంది. ఈ కారణంగా అభివృద్ధి చేయలేకపోతున్నా. బోరు మోటర్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాం. ప్రధాన సమస్యలను మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - నందునాయక్ సర్పంచ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement