-
డిఫరెంట్ స్టైల్లో కొత్త ఏడాది 2024కి స్వాగతం (ఫొటోలు)
-
'కొత్త సంవత్సరం 2024' వస్తోంది.. అందరం కలిసి ఆహ్వానిద్దామా!
‘ఆ.. ఏం న్యూ ఇయర్ అండీ.. తిని నిద్రపోక’.. ‘మేం ఎక్కడికీ వెళ్లం.. ఎవరినీ పిలవం.. టీవీ చూసి నిద్రపోతాం’.. అంత నిర్లిప్తత... నిరాసక్తత ఎందుకు? న్యూ ఇయర్ అంటే కొత్త కాలెండర్.. కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. అర్ధరాత్రి పొద్దుపొడుపు.. లోలోపల నిర్లిప్తత ఉంటే కాలం బ్రైట్‌గా ఎలా షేక్‌హ్యాండ్ ఇవ్వగలదు? మన కోసం 2024 అనే అతిథి వస్తోంది. నలుగురితో కలిసి హుషారుగా ఆహ్వానించండి. కుటుంబమంతా కలిసి సెలబ్రేట్ చేయండి. మంచి ప్రారంభం సంతోషాలకు తొలిమెట్టు.' 2024 వస్తోంది.. వస్తే.. మనకేం సంబంధం? అదేంటి? 2024 ఊరికే వస్తుందా? కొత్త కాలచక్రాన్ని తీసుకుని వస్తుంది. పండుగ సెలవులు, ఇంక్రిమెంట్ సమయాలు, ప్రమోషన్ల ఆంకాక్షలు, పరీక్షల రిజల్ట్‌లు, పై తరగతుల అడ్మిషన్లు, జాబ్ ఇంటర్వ్యూలు, అమెరికా వీసాలు, పెళ్లి ముహూర్తాలు, ఎండల మామిడిపండ్లు, వానలతో ΄ారే ఏర్లు, దసరా సంబరాలు, అభిమాన హీరోల బ్లాక్బస్టర్లు... ఎన్నెన్ని తెస్తుందది. ఏమో.. కుదిరితే ప్రజాహితమైన మరిన్ని పాలనా విధానాలు కూడా తేవచ్చు. ఇవన్నీ ప్రత్యేక్షంగానో పరోక్షంగానో మనతో ముడిపడి ఉంటాయి. అందుకే కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం పలకాలి. హాయ్ చెప్తూ వెల్కమ్ చేయాలి. మాకై మంచి మంచి సంతోషాలను మోసుకురా సుమా అని ఆకాంక్షించాలి. నలుగురు ఉంటే సరదా.. వేడుక సమయాల్లో ఎప్పుడూ నలుగురు ఉంటేనే సరదా. డిసెంబర్ 31 రాత్రి అంటే మరీ ఆర్భాటం అక్కర్లేదు. నిషా ఉండాలన్న నియమం లేదు. హాయిగా కుటుంబ సమేతంగా గడిపి, విందు భోజనంతో, చక్కని ΄ాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఆరుబయట చలిమంట వేసుకుంటూ గడిపి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించవచ్చు. లేదా సమీపంలో ఉన్న దగ్గరి బంధువులనో, ఆప్త మిత్రులనో లిమిటెడ్‌గా పిలిచి ఎంజాయ్ చేయవచ్చు. ఇష్టమైన మనుషులు ఉంటే మానసికంగా చాలా ఉత్తేజం ఉంటుంది. మరీ ముఖ్యం.. ఇవాళ చాలామంది మిత్రుల పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అలాంటి మిత్రుల్ని పిలిచి ఈ సంతోష సమయాలను పంచవచ్చు. అలంకరణలూ ఆనందమే.. కొత్త సంవత్సరం కొత్త కాంతులు తేవాలని అందరికీ అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఇంటిని డల్‌గా ఉంచొద్దు. చక్కగా సర్దుకోవాలి. ΄పాత సామాన్లు తీసి బయట ΄పారేయాలి. వీలైతే కొత్త కర్టెన్లు, బెడ్షీట్లు మార్చవచ్చు. రంగు కాగితాలు, బెలూన్లు శోభను తెస్తాయి. మార్కెట్లో లేదా అమేజాన్‌లో తక్కువ ధరకే సీరియల్ లైట్లు దొరుకుతున్నాయి. అవి కొన్ని ఇంట్లో వెలిగిస్తే చాలా బాగుంటుంది. మంచి అగర్‌బత్తీలతో, రూమ్ స్ప్రేయర్లతో ఇంటిని పరిమళ భరితం చేసి కొత్త సంవత్సర ఆగమన ఘడియలకు సిద్ధమవ్వాలి. మంచి విందు.. చాలా పసందు! నలుగురూ కలిసి ఇలాంటి సమయంలో ఛలోక్తులతో, చతురోక్తులతో వంట చేస్తే బాగుంటుంది. ఆడవాళ్లకు యధావిధిగా వంట భారం అప్పజెప్పక పోవడమే మంచిది. పార్టీలు గట్రా ఉంటే స్నాక్స్ బయట నుంచి తెప్పించుకున్నా మెయిన్ కోర్స్‌ను ముచ్చట కొద్దీ వండుకోవచ్చు. అదో పద్ధతి. లేదంటే మిత్రులు కొన్ని పదార్థాలు వండుకుని వస్తే, కొన్ని పదార్థాలు మనం వండ వచ్చు. కష్టమూ సంతోషమూ పంచుకున్నట్టు అవుతుంది. చివరలో కేక్ ఎలాగూ కట్ చేస్తారనుకోండి. ఆటలూ పాటలూ.. దాగివున్న విద్యలు బయటపెట్టే సందర్భాలు ఇవి. ఎప్పుడో కాలేజీ రోజుల్లో పాడి ఉంటారు. ఇప్పుడు పాడండి. ఏవో ఇష్టమైన డైలాగులు అభినయించి ఉంటారు. ఇప్పుడూ చేయండి. పిల్లలతో కలిసి సరదాగా నాలుగు స్టెప్పులేయండి. ఇరుగు పొరుగుకు అభ్యంతరం లేని మోతాదులో సందడి చేయండి. వినడానికి ఘంటసాల, పి.సుశీల డ్యూయెట్లా, ఇళయరాజా తమిళ పాటలా అనే వాదనలు కూడా ఇలాంటి సమయాల్లో బాగుంటాయి. చివరగా.. నిద్రపోయే ముందు మనస్ఫూర్తిగా లోకంలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కామనలు సృష్టికి తెలపండి. అలకలు, ఫిర్యాదులు ఏవైనా ప్రకృతికి ఉంటే దాని మనసు మెత్తబడేలా మనస్ఫూర్తిగా అందరి కోసం ప్రార్థన చేయండి. 'ప్రకృతి వింటుంది. కాలానికి చెబుతుంది. సృష్టి శిరసావహిస్తుంది. శుభమ్!' ఇవి చదవండి: Happy New Year 2024: వెల్కమ్ పార్టీ -
అక్కడ అమితాబ్... ఇక్కడ ప్రభాస్
టైమ్ దగ్గరపడుతోంది. ఎవరెవరికి ఆహ్వానాలు అందించాలి? ఏ ప్లేస్ సెలక్ట్ చేయాలి? ఎక్కడైతే వచ్చే అతిథులకు సౌకర్యంగా ఉంటుంది? అని తెగ ఆలోచిస్తున్నారట ప్రభాస్. ఏంటీ? పెళ్లి గురించి ప్రభాస్ ఏదైనా శుభవార్త చెప్పబోతున్నారా? అని ఆశ పడకండి. అందుకు టైమ్ ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఓ వెల్కమ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్. కెనడియన్ సింగర్ బ్రయాన్ ఆడమ్స్ వచ్చే నెలలో ‘అల్టిమేట్ టూర్’లో భాగంగా అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు రానున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ‘బేర్ బోన్స్’ టూర్లో భాగంగా ఇండియా వచ్చారు బ్రయాన్. మళ్లీ ఇప్పుడు కుదిరింది. ఆయనకు హైదరాబాద్‌లో వెల్కమ్ పార్టీ ఇవ్వనున్నారట ప్రభాస్. ఇక్కడ ప్రభాస్ అయితే బాలీవుడ్‌తో ఈ బాధ్యతను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బి ఇచ్చే పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆల్రెడీ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, ఆలియా భట్, ఫర్హాన్ అక్తర్ ఆసక్తిగా ఉన్నారట. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా అయితే మరో అడుగు ముందుకు వేసి అదే నెలలో విడుదల కానున్న తమ సినిమా ‘నమస్తే ఇంగ్లాండ్’ను ఈ పార్టీలో ప్రమోట్ చేయాలనుకుంటున్నారని బీటౌన్ టాక్. అదండీ విషయం. -
ట్రంప్‌కోసం బాలీవుడ్ నటి ఆట..పాట
న్యూయార్క్: ఎన్నికల ప్రచార బాధ్యతలు ముగిసిన తర్వాత మరోసారి బాలీవుడ్ నటి, మోడల్ మనస్వీ మాంగాయి అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూర్చొనున్న వేదికపై కనిపించనుంది. ఆయనకు స్వాగతం చెబుతూ నిర్వహించే ఉత్సవానికి బాధ్యత వహించడమే కాకుండా అదే వేదికపై ఆడిపాడనుంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నుంచి మనస్వీ పాల్గొంది. ఆ తర్వాత శుక్రవారం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కోసం స్వాగత కార్యక్రమంలో పాలుపంచుకోనుంది. ఈ కార్యక్రమాన్ని లింకన్ మెమోరియల్ వద్ద నిర్వహించనున్నారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ 2010 కూడా బాలీవుడ్లో హిట్ సాంగ్స్‌గా పేరొందిన కాలా చష్మా, జుమ్మేకిరాత్, ధూమ్ మాచాలే, జయహో వంటి గీతాలను ప్రదర్శించనున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement