-
ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు
-
ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!
2016-17 బడ్జెట్ వివరణలో పొందుపరిచిన ఎస్సీ శాఖ రాష్ర్టంలో కొత్తగా 40 సమీకృత సంక్షేమ భవనాలు హైదరాబాద్: ఎస్సీ సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించే అంశాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపర్చింది. విద్యా, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లను ప్రాధాన్యాలుగా నిర్దేశించింది. ప్రధానంగా స్కూళ్ళు, హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర భవనాల నిర్మాణాలను అధికారులు చేపట్టనున్నారు. ఆయా భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. శాసనసభకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సమర్పించిన 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో ఆయా అంశాలను పొందుపరిచారు. ఆయా భవనాల నిర్మాణాలకు నిధులు: ఇందులో ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, స్టడీ సర్కిళ్ల ఇతర గృహాల నిర్మాణానికి రూ.180 కోట్ల మేర అవసరమని బడ్జెట్ ప్రతిపాదనల్లో సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఎస్సీ ఉద్యోగినులకు రూ.2 కోట్లతో హైదరాబాద్‌లో రెండు వసతి గృహాల నిర్మాణానికి గత బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి 2013-14లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 88 భవనాలకు రూ.228 కోట్లు మంజూరు చేశారు. వీటిల్లో చాలావరకు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులకే కాకుండా ప్రతి జిల్లాకు నాలుగు చొప్పున రాష్ర్టంలో మొత్తం 40 కొత్త సమీకృత సంక్షేమ భవనాల నిర్మాణానికి 2016-17లో రూ.120 కోట్లు ప్రతిపాదించినట్లు ఎస్సీ శాఖ బడ్జెట్ వివరణలో తెలిపింది. బాలికల కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్లతో నిర్మిస్తున్న స్టడీసర్కిల్ నిర్మాణం పూర్తి కావొచ్చిందని ఎస్సీ శాఖ తెలిపింది. అలాగే లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ భవనాన్ని పున ర్నిర్మించి లైబ్రరీ, మినీ సమావేశ మందిరాలు, ఆడిటోరియమ్ వంటి సదుపాయాల కల్పనకు 2016-17లో ప్రతిపాదించినట్లు, దీనికి రూ.20.50 కోట్లు ప్రతిపాదించినట్లు బడ్జెట్ ఫలితాల వివరణలో ఎస్సీ శాఖ వివరించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement