-
జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?
సుదీర్ఘ చట్టపర తగాదా తర్వాత, లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2022 ఏప్రిల్ 20న, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేని అమెరికాకు అప్పగించాలని ఉత్తర్వు జారీచేసింది. బ్రిటన్ హోమ్ సెక్రెటరీ ప్రీతి పటేల్ అతన్ని అమెరికాకు అప్పజెప్పడానికి ‘స్టాంప్’ వేసే స్థితికి వచ్చారు. అమెరికాలో అసాంజేపై గూఢచర్య చట్టం కింద విచారణ జరుగుతుంది. గూఢచారికీ, సమాజ సంరక్షకునికీ మధ్య తేడాను ఈ చట్టంలో వివరించలేదు. చరిత్రలో మొదటిసారి ఈ చట్టాన్ని ఒక పాత్రికేయునికి వర్తింపజేశారు. అసాంజే పాత్రికేయుడు కాదని అమెరికా ప్రభుత్వ వకీలు వాదించారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా పూర్వ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్. అమెరికా ప్రభుత్వం సొంత ప్రజల ఫోన్ కాల్స్, అంతర్జాల చర్యలు, వెబ్ కెమెరాలపై నిఘాను నిరూపించే రహస్య పత్రాలను బయట పెట్టారు. ఆయన మీద కూడా గూఢచర్య చట్టం కింద కేసు పెట్టారు. ‘‘అమెరికా న్యాయ శాఖ పాత్రికేయతపై యుద్ధం చేస్తోంది. ఈ కేసు అసాంజేపై కాదు, మీడియా భవిష్యత్తును నిర్ణయించేది’’ అని వ్యాఖ్యానిస్తూ పాత్రికేయునిపై ఈ చట్ట వర్తింపును స్నోడెన్ ఖండించారు. అసాంజేను వాక్ స్వాతంత్య్ర విజేతగా ఒకప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. 2010లో ఆయన అమెరికా కుట్రల రహస్య సమాచారం బయట పెట్టగానే అదే మీడియా అసాంజేను వదిలేసింది. అసాంజే ఈ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయగలిగినా, కోర్టులో నెగ్గే అవకాశం చాలా తక్కువ. అసాంజే ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంపాదకుడు, ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక పారదర్శక సమాజం ఉన్న స్వీడెన్‌లో స్థిరపడ్డారు. 2006లో వికీలీక్స్ స్థాపించాడు. 2010లో వికీలీక్స్ అమెరికా కుతంత్రాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది. వర్గీకరించిన వరుస దస్త్రాలనూ, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్నీ పెద్ద మొత్తంలో ప్రచురించిన తర్వాత అమెరికా అసాంజేపై 18 నేరాలు మోపింది. ఇవి రుజువయితే వందేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా ఇద్దరు స్వీడెన్ సెక్స్‌వర్కర్లతో అసాంజేపై అసమంజస అత్యాచార కేసులు పెట్టించింది. ఆ కేసుతో సహా గూఢచర్య విచారణను ఎత్తేయాలని స్వీడెన్ 2012లో నిర్ణయించి, 2017లో ఎత్తేసింది. స్వీడెన్ పార్లమెంటులో మితవాదం బలపడిన తర్వాత అసాంజేపై ఎత్తేసిన కేసులను 2019 మేలో తిరగదోడింది. కానీ నవంబర్‌లో విచారణను ఆపేసింది. అసాంజే 12 ఏళ్ల నుండి నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు ఆరేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వడోరియన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయ మిచ్చారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తు న్నారు. బయటికి పోతే లండన్ పోలీసులు అరెస్టు చేసి అమెరికాకు అప్పజెపుతారని భయం. ఈక్వడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో అసాంజేను అప్పజెప్పి అమెరికాను సంతోషపెట్టాలని నిర్ణయించినప్పటి నుండి ఆయన కష్టాలు పెరిగాయి. 12 ఏళ్ళు దాటినా అమెరికా అసాంజేను కంటిలో ముల్లుగా, పక్కలో బల్లెంలా చూస్తోంది. తమ రహస్య సమాచారాన్ని బయటపెట్టి తమ దేశం పరువు పోగొట్టాడని భావిస్తోంది. (క్లిక్: అసమ్మతి గళాలపై అసహనం) అసాంజే వికీలీక్స్ ఘటన తర్వాత అమెరికాను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ‘రక్షణల’ నిజ స్వరూపం తెలిసింది. అమెరికా అంతర్జాతీయ సమాజ నియమాలు, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా యునైటెడ్ కింగ్డమ్ వంటి తన సన్నిహిత దేశాల సహాయంతో జైలులో పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. తన స్వేచ్ఛా ముఖాన్ని ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికే వాడుకుంటోంది. (క్లిక్: రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే పెళ్లి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోబోతున్నారని వికీలీక్స్ మీడియా బృందం తెలిపింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం అసాంజే జైల్లో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో జైలులోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరగనుంది. వికీలీక్స్ ప్రకారం, వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమానికి జైలు వెలుపల చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్‌ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. -
‘ఇలాగైతే అసాంజే జైలులోనే మరణిస్తారు’
లండన్ : వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అసాంజే ఆరోగ్యం సరిగా లేదని, విచారణ పేరిట వేధింపులు కొనసాగితే బ్రిటిష్ జైలులోనే ఆయన మరణించవచ్చని 60 మందికి పైగా వైద్యులు బ్రిటన్ హోం సెక్రటరీకి రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. అసాంజేకు తక్షణమే శారీరక, మానసిక వైద్య చికిత్సలు అవసరమని తేల్చిచెప్పారు. గూఢచర్య ఆరోపణలపై అసాంజేను తమకు అప్పగించాలని బ్రిటన్ను అమెరికా కోరుతోంది. గూఢచర్యం చట్టం కింద అసాంజేపై ఆరోపణలు నిగ్గుతేలితే అమెరికన్ జైలులో ఆయన 175 ఏళ్లు మగ్గవలసి ఉంటుంది. అసాంజేను ఆరోగ్య కారణాలతో బెల్మార్ష్ జైలు నుంచి యూనివర్సిటీ టీచింగ్ ఆస్పత్రికి తరలించాలని హోం సెక్రటరీ ప్రీతిపటేల్, బ్రిటన్ దేశీయాంగ మంత్రికి రాసిన లేఖలో వైద్యులు కోరారు. లండన్‌లో అక్టోబర్ 21న కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజేను చూసినవారు వెల్లడించిన వివరాలతో పాటు ఆయన ఎదుర్కొంటున్న వేధింపులపై ఐరాస ప్రతినిధి నిల్స్ మెల్జర్ నివేదిక ఆధారంగా తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అసాంజేపై విచారణ పేరుతో వేధింపులు కొనసాగితే ఆయన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో ఆప్ఘనిస్తాన్, ఇరాక్లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
అసాంజేకు 50 వారాల జైలు శిక్ష
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బుధవారం లండన్ న్యాయస్థానం 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలను ఆరోపించినందుకుగానూఈ శిక్షవిధిస్తూ సౌత్ వర్క్ క్రౌన్ కోర్డు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వికీలీక్స్ ఖండించింది. ఈ తీర్పుషాకింగ్, కుట్రపూరితమైందని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేపై గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్‌లో స్వీడన్లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే ఈక్వడేరియన్లో తలదాచుకున్న అసాంజేకు ఎంబసీ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘వికీలీక్స్’ అసాంజె అరెస్ట్
లండన్: అమెరికా రక్షణ రహస్యాలు బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె(47) అరెస్టయ్యారు. ఏడేళ్లుగా ఆయన లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు . అసాంజెకు కల్పించిన శరణార్థి హోదా, పౌరసత్వాన్ని ఈక్వెడార్ తాజాగా ఉపసంహరించడంతో గురువారం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. తమ రహస్యాలను తస్కరించి ఘోరమైన నేరానికి పాల్పడిన అసాంజెను తమకు అప్పగించాలని అమెరికా పెట్టుకున్న విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, అసాంజె తమ మందు గైర్హాజరై బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు 12 నెలల శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం స్వీడన్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై అరెస్టయినప్పటి నుంచి అసాంజె ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తనను స్వీడన్‌కు అప్పగిస్తే, చివరకు అమెరికాకు అప్పగిస్తారని, అదే జరిగితే తనకు మరణ దండన లేదా చిత్రహింసలు తప్పవని పేర్కొంటూ ఈక్వెడార్ సాయం అర్థించిన తెలిసిందే. కోర్టు ముందు లొంగిపోవడంలో విఫలమైన అసాంజెకు వ్యతిరేకంగా అదే కోర్టు 2012 జూన్ 29న ఆదేశాలిచ్చిందని, ఆ వారెంట్ ప్రకారమే ఆయన్ని అరెస్ట్ చేశామని మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించింది. అసాంజె అరెస్ట్‌ను యూకే ప్రభుత్వం స్వాగతించింది. యూకే, ఈక్వెడార్ల మధ్య జరిగిన విస్తృత చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొంది. శరణార్థి నిబంధనలను అసాంజె తరచూ ఉల్లంఘించారని అందుకే ఆయనకు కల్పించిన రక్షణను ఉపసంహరించుకున్నామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో చెప్పారు. ఇటీవలి కాలంలో అసాంజె, తన ఆతిథ్య దేశం ఈక్వెడార్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసాంజె ఆశ్రయంపై పలు కొత్త నిబంధనలు విధించిన ఈక్వెడార్..ఆయన ఇంటర్నెట్ వినియోగం పైనా ఆంక్షలు పెట్టింది. రహస్యాలు బహిర్గతం చేసిన అసాంజెపై అభియోగాలు మోపినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. కానీ కీలక పత్రాల ముద్రణకు సంబంధించి అసాంజెపై నేరపూరిత ఆరోపణలు నమోదైనట్లు గతేడాది బయటపడింది. అసాంజె కేసు నేపథ్యమిదీ అమెరికా దౌత్య విధానాలు, అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి వికీలీక్స్ 2010లో 7.20 లక్షల కీలక పత్రాలను బహిర్గతం చేసింది. అదే ఏడాది అసాంజెపై లైంగికదాడి ఆరోపణలు రావడంతో స్వీడన్ కోర్టు వారెంట్ జారీచేసింది. లండన్‌లో లొంగిపోయిన అసాంజె బెయిల్‌పై విడుదలయ్యారు. అసాంజెను స్వీడన్‌కు అప్పగించాలని 2011లో బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. అదే జరిగితే తనను స్వీడన్ నుంచి అమెరికాకు అప్పగిస్తారని ఈక్వెడార్ సాయం కోరారు అసాంజె. దీంతో 2012 జూన్‌లో ఆయనకు ఈక్వెడార్ రాజకీయ శరణార్థి హోదా ఇచ్చింది. లండన్‌లో అసాంజెను ప్రశ్నించేందుకు స్వీడన్ అధికారులకు ఈక్వెడార్ అనుమతివ్వలేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈక్వెడార్ ఆయనపై పలు ఆంక్షలు విధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్ కోసం ఉగాండ జట్టు ప్రకటన.. 43 ఏళ్ల స్పిన్నర్‌కు చోటు
No Headline
No Headline
No Headline
No Headline
మద్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించండి
తక్కెళ్లపాడులో దారుణహత్య
కోల్డ్‌స్టోరేజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి
టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్ జగన్‌తోనే సాధ్యం
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement