-
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్
Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్.. స్పానిష్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. తద్వారా అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. Classy words from the seven-time champion. An emotional Novak Djokovic speaks after his #Wimbledon final defeat to Carlos Alcaraz... pic.twitter.com/Lvg980Sbn8 — Wimbledon (@Wimbledon) July 16, 2023 కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్ 2023 ఫైనల్ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్కరాజ్ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్కరాజ్ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంటర్ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్కరాజ్.. సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్ గెలిచి గ్రాండ్‌స్లామ్ ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్.. తొలి సెట్ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. -
జొకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు. -
సెరెనా వచ్చేసింది
లండన్: ఏడు సార్లు వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్ వన్, అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తన ఎనిమిదో టైటిల్ వేటలో ఆమె ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఎదుర్కోనుంది. శనివారం జరిగే తుదిపోరులో వీళ్లిద్దరు తలపడనున్నారు. 2016లో వీరిద్దరి మధ్యే జరిగిన ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచింది. ప్రసవానంతరం బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు ముందే గాయంతో తప్పుకున్న సెరెనా, ఈ సారి పచ్చికపై తన అసలు ఆటను ప్రదర్శిస్తూ ఫైనల్ చేరడం విశేషం. సెమీస్‌లో 25వ సీడ్ సెరెనా 6–2, 6–4తో 13వ సీడ్ జులియా జార్జెస్‌పై అలవోక విజయం సాధించింది. 12 ఏళ్లుగా ఏనాడు ప్రిక్వార్టర్ దశను దాటలేకపోయిన జార్జెస్‌ను అమెరికా టెన్నిస్ దిగ్గజం గంటా 10 నిమిషాల్లో ఇంటిదారి పట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన కెర్బర్ వింబుల్డన్‌లో రెండోసారి ఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 11వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ వరుస సెట్లలో 12వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై అలవోక విజయం సాధించింది. గంటా 8 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3తో ఒస్టాపెంకోను ఇంటిదారి పట్టించింది. అదేపనిగా అనవసర తప్పిదాలు, డబుల్ ఫాల్ట్‌లతో ఒస్టాపెంకో పరాజయం చవిచూసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement