-
నేటి సెమీస్‌లో చెన్ యుఫెతో ‘ఢీ’
-
సింగిల్స్ చాంప్స్ మొమొటా, ఒకుహారా
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారులు కెంటో మొమొటా, నొజోమి ఒకుహారా మెరిశారు. పురుషుల సింగిల్స్‌తోపాటు మహిళల సింగిల్స్‌లోనూ టైటిల్స్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల ఫైనల్లో కెంటో మొమొటా 21-15, 21-12తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒకుహారా 22-20, 21-18తో యిహాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింగిల్స్ విభాగంలో జపాన్ ఆటగాళ్లు టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. ఒకుహారా ఈ టోర్నీలో అజేయంగా నిలువడం విశేషం. టైటిల్ గెలిచే క్రమంలో ఒకుహారా లీగ్ దశలో ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్), రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్ (భారత్)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన మొమొటా, ఒకుహారాలకు 42 వేల డాలర్ల (రూ. 28 లక్షల 20 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున సైనా, శ్రీకాంత్ బరిలోకి దిగినప్పటికీ ఇద్దరూ లీగ్ దశలోనే నిష్ర్కమించారు. -
వరల్డ్ సూపర్ సిరీస్: సైనా విజయం
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌పై 21-23, 9-21, 21-12 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా గెలుపొందింది. తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైన విషయం అందరికీ విదితమే. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్ల చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో... మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 14-21, 6-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్, కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడతారు. ఒకుహారాతో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా ఈసారి మాత్రం తేలిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. ఇక మొమొటాతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ తన సహజశైలి ఆటతీరును కనబర్చలేకపోయాడు. ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సైనా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ కమిటీ ఎన్నికల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోటీపడనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు స్థానాల కోసం మొత్తం 24 మంది స్టార్ క్రీడాకారులు పోటీపడనున్నారు. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: లీగ్ దశలో అజేయంగా నిలిచిన సైనా నెహ్వాల్ అసలు పోరులో తడబడింది. బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో నిష్ర్కమించింది. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్ కూడా సెమీఫైనల్లోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-11, 13-21, 9-21తో తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 18-21, 13-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement