-
షావోమి ఎ1 పై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్సెట్ మేకర్ షావోమీ తన అభిమానులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లో ఎంఐ ఎ1 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ డివైజ్‌పై రూ.2వేల రూపాయల మేర తాత్కాలిక డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో ఈ ప్రత్యేక డిస్కౌంట్‌తో ఎంఐ ఎ1 లభ్యంకానుందని షావోమి ట్విట్టర్లో వెల్లడించింది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ను షావోమి లాంచ్ చేసింది. లాంచింగ్ సందర్భంగా దీని ధర 14,999 రూపాయలు. అయితే ప్రస్తుత తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.12,999కే లభించనుంది. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Mi fans! Announcing #2000offOnMiA1 from 7th-9th December exclusively on @Flipkart & https://t.co/nVqFSYMyzY! Mark this date and don't miss this deal. RT with #2000offOnMiA1 and you might just win one! pic.twitter.com/oWcMRmG4CO — Mi India (@XiaomiIndia) December 5, 2017 -
బ్యాండ్ బజాయిస్తున్న ఫిట్ రిస్ట్
చేతులకు బ్యాండ్ పెట్టుకోవడం ఈ తరహా కుర్రాళ్లో కొత్తరకం ఫ్యాషన్. అభిరుచులకు తగ్గట్టు మార్కెట్లో ఎలాంటి బ్యాండ్ లు లభిస్తున్నాయో తెలుసుకుని మరీ కొనేస్తుంటారు. వాటిని పెట్టుకుని తెగ సంబరపడిపోతుంటారు ఈ కుర్రకారు. ఈ విధంగా యువతను ఆకట్టుకోవడం కోసం, వారి అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల లేటెస్ట్ బ్యాండ్ లను కంపెనీలు రూపొందిస్తున్నాయి. మార్కెట్లో లభించే షియోమీ, ఫిట్ బిట్, జావ్ బోన్, జోకి వంటి వివిధ బ్యాండ్లను అమ్మకాలను బీట్ చేస్తూ ఇంటెక్స్ ఫిట్ రిస్ట్ బ్యాండ్ దూసుకెళ్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ తో యువతను తెగ ఆకట్టుకుంటోంది. కేవలం రూ.999కే మార్కెట్లో లభించే ఈ బ్యాండ్, షియోమీ బ్యాండ్ ల మాదిరిగానే ఉంటోంది. కానీ దీనిలో స్పెషల్ ఫీచర్ గా డిస్ ప్లేను కలిగి ఉండటం యువతకు తెగ నచ్చేసింది. డిస్ ప్లే బ్యాటరీలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం పనిచేసేలా దీన్ని రూపొందించారు. డిస్ ప్లే కలిగి ఉన్న ఈ బ్యాండ్... నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటుంది. రబ్బర్ తో ఈ బ్యాండ్ తయారుచేయడం వల్ల చాలా సున్నితంగా ఉంటూ చేతికి పెట్టుకున్న ఫీలింగే అనిపించింది. ఎన్నిగంటలైనా చేతికి ధరించి ఉంచుకోవచ్చు. ఈ బ్యాండ్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. దీన్ని కనెక్టు చేయాలంటే కూడా చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితాలను ఇది అందిస్తుందా? అనడంలో మాత్రం ఇంటెక్స్ కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వలేకపోతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement