-
ఫిట్నెస్ మ్యాజిక్ పిల్ ఏమీ కాదు
పాతికేళ్లకు పైగా ఫిట్నెస్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు యాస్మిన్ కరాచీవాలా. బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న యాస్మిన్‌కి ముంబైతో పాటు విదేశాల్లోనూ ఫిటెనెస్ స్టూడియోలు ఉన్నాయి.ఫిట్‌నెస్‌కు సంబంధించిన తన అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకు వచ్చి రైటర్‌గానూ గుర్తింపు పొందారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రివల్యూషనైజ్ యువర్ వర్కౌట్ కార్యక్రమానికి వచ్చిన ఈ ముంబై ఫిట్నెస్ ట్రైనర్ ‘53 ఏళ్ల వయసులోనూ చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు ఆ సీక్రెట్ ఏంటో మాకూ చెప్పండి’ అంటే ఎన్నో విషయాలను మన ముందుంచారు. నంబర్ వన్ ట్రైనర్ కత్రీనా కైఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్.. వంటి ప్రముఖ బాలీవుడ్ తారలకు నంబర్‌వన్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా. జర్మన్ పిలేట్స్ కాన్సెప్ట్‌ను మన దేశంలో మొదటిసారి ప్రవేశపట్టి, బిఎఎస్ఐ సర్టిఫికెట్ పొందింది. ఎన్నో ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్‌లను సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్‌ను అందుకున్న ఘనత యాస్మిన్ది. స్కల్ప్›్ట అండ్ షేప్, పర్ఫెక్ట్ 10 పేరుతో తీసుకొచ్చిన పుస్తకాలు పాఠకులకు ఫిట్నెస్ జ్ఞానాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ‘‘(నవ్వుతూ) నాకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్దబ్బాయికి 26, చిన్నబ్బాయికి 23 ఏళ్లు. అమ్మాయికి పెళ్లైంది. 26 ఏళ్లుగా వ్యాయామంపై దృష్టి పెడుతున్నాను. వ్యాయామాలు నేర్పిస్తున్నాను. సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనశైలిని అలవర్చుకుంటే ఎవ్వరైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండచ్చు. ఫిట్నెస్ అనేది కేవలం బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించే మ్యాజిక్ పిల్ కాదు షాప్‌కి వెళ్లి కొనుక్కోవడానికి. ఫిట్‌గా మారాలంటే కృషి చేయాల్సిందే. కృషికి మూలం నన్ను చూసి మా అబ్బాయిలు ఇద్దరూ ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. వాళ్లూ ఈ రంగంలో బిజీగా ఉన్నారు. నచ్చింది చేయడం మన జీవనశైలి అవుతుంది. ఇష్టం లేనిది చేయడం భారం అనిపిస్తుంది. ఫిట్నెస్ అనేది ట్రెండ్ కాదు. అదొక జీవన విధానం. మనం దానిని ఎలా తీసుకుంటే, అది మనల్ని అలా మార్చేస్తుంది. నేను ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నా చిన్నతనం నుంచి నేను గమనించినవాటిలో మా నాన్న రోజూ వాకింగ్, అమ్మ యోగా చేయడం చూసేదాన్ని. కానీ, (నవ్వుతూ) నేను మాత్రం చేసేదాన్ని కాదు. ఎవ్వరూ ఇష్టపడని బద్దకిష్టులలో నేనూ ఒకరిగా ఉండేదాన్ని. డిగ్రీ పూర్తయిన కొన్నాళ్లకు ఓ రోజు నా ఫ్రెండ్ హెల్త్ క్లబ్‌కి తీసుకెళ్లింది. అయిష్టంగానే అక్కడికి వెళ్లాను. ఆ హెల్త్క్లబ్కు వెళ్లే ముందు వరకు ఎన్నడూ వ్యాయామం చేసింది లేదు. ఏదో ఒక సాకుతో ఫిట్నెస్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేదాన్ని. అలాంటిది సరదాగా హెల్త్ క్లబ్లో చేసిన ప్రయత్నాలు దారిలో పడేలా చేశాయి. అప్పటినుంచి ఇన్నేళ్లుగా నన్ను నేను మలుచుకుంటూ ఇంకొందరిని మారుస్తున్నాను. చురుకైనా మార్పులంటే.. ఫిట్‌గా ఉండటానికి, వ్యాయామంప్రారంభించాలంటే ముందు మన శరీర బలాన్ని అదేవిధంగా పరిమితులను అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కృషి చేయాలనే జిజ్ఞాసను, నిబంధననూ బ్రెయిన్‌కు అందించాలి. మనల్ని మనం ఎలా చూసుకోవాలను కుంటున్నామో ముందు దానిని గుర్తించాలి. అప్పుడు సరైన కృషి చేయగలం. కొందరు జిమ్‌కి వెళితే వ్యాయామం సాధ్యం అనుకుంటారు. ఇంకొందరు నాకు సినిమా తారల్లాంటి శరీరం కావాలి అని కలలు కంటుంటారు. ఇలాంటివారు తమ రోజువారి యాక్టివిటీలో మార్పులు చేసుకోవాలి. బద్ధకం పోవడానికి, చురుగ్గా మారడానికి స్పోర్ట్స్ హాబీని పెంచుకోవాలి. ఫిట్నెస్, వాకర్స్ .. వంటి గ్రూపుల్లో చేరాలి. ఏదోవిధంగా ప్రతిరోజూ చురుగ్గా ఉండేలా మార్పులు చేసుకోవాలి. వీటితోపాటు రోజువారీ వదుల్చుకోలేని కొన్ని విషాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి విషాలు.. చక్కెర క్యాన్సర్‌కు ఆహారం. అంతేకాదు, అనేకవ్యాధులకు ప్రధాన కారణం కూడా. చాలా మంది ఉదయాన్నే షుగర్ కలిపిన టీ లేదా కాఫీతో రోజును మొదలుపెడతారు. అదే అనారోగ్యాలకు దగ్గర చేస్తుంది. అందుకని, ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్‌ని పూర్తిగా దూరం పెట్టాలి. దీనికి బదులు బెల్లం, తేనె తీసుకోవచ్చు. ఇక నూనెలో వేయించిన సమోసాలు, బోండాలు.. వంటి వేపుడు పదార్థాలు తీసుకోకూడదు. వేడుకల సమయాల్లో ‘ఏముందిలే, ఈ ఒక్కరోజుకు అంటూ ఐస్‌క్రీమ్, షుగర్ బేస్డ్ వంటి ఎన్నో పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ శరీరానికి హాని చేసేవే. సవాళ్లను అధిగమించాలంటే.. నాకు ముంబై, గుర్గావ్, ఢిల్లీ, ఇండోర్, ఢాకా, దుబాయ్‌లలో ఫిట్నెస్ స్టూడియోలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఫిట్నెస్ స్టూడియోలుప్రారంభించాలనే లక్ష్యంగా ఉన్నాను. వ్యాయామం మొదలుపెట్టిన రోజున ఇవేవీ అప్పుడు అనుకోలేదు. బలం ఎంత అనేది బరువులు ఎత్తడంలో మాత్రమే కాదు మన లోపల ఉన్న శక్తిని గుర్తించాలి. అప్పుడు సవాళ్లను అధిగమించడం కూడా సులువు అవుతుంది. మెరుగైన ఆరోగ్యం, ఫిట్నెస్ మనల్ని శక్తి–అభివృద్ధి వైపుగా నడిపిస్తుంది. ఒక్కరోజులో ఏదీ మారదు. మనం ఎంచుకున్న మార్గంలో నిరంతరం కృషి చేస్తుంటే విజయం సొంతం అవుతుంది. శారీరక వ్యాయామం మైండ్‌ను కూడా చురుగ్గా ఉంచుతుంది కాబట్టి వాయిదా వేయకుండా ఈ రోజే దినచర్యలో భాగం చేసుకోండి’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్. – నిర్మలారెడ్డి ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి -
హాలీవుడ్ కోసం బాలీవుడ్ భామ కసరత్తు
ముంబై: బాజీరావు మస్తానీ భామ దీపికాపదుకోన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీసెల్ జంటగా తెరకెక్కబోతున్న హాలీవుడ్ మూవీ ‘xxx'. బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్లో తెరంగేట్రం చేయనున్న ఈ ట్రిపుల్ ఎక్స్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్లో హల్ చల్ చే్స్తోంది. సినిమాలోని యాక్షన్ సీన్స్‌లో సూపర్ స్టార్ విన్ డీసిల్కు పోటీగా నటించేందుకు దీపికా ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని దీపికా పదుకోన్‌కు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న యాస్మిన్ కరాచీవాలా ట్వీట్ చేసింది. ఆమె శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను ఇన్స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్ అయింది. అటు దీపికా పదుకోన్ కూడా దీనిపై స్పందించింది. హాలీవుడ్ ఎంట్రీపై తనకు కూడా టెన్షన్‌గా ఉందని కామెంట్ చేసింది. చాలా ఉత్సాహంగా కూడా ఉందని పేర్కొంది. వచ్చేవారమే తన ఫస్ట్ హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నానని చెప్పింది. మొదట డొమినికన్ రిపబ్లిక్లో ‘xxx' మూవీ షూటింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. యాక్షన్ స్టార్ విన్‌డీజిల్ నటిస్తున్న ఈ సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో అతనితో పోటీగా నటించేందుకు దీపికా సన్నద్ధమవుతోంది. అందుకే ఎంతో కష్టపడి మరీ ఈ శిక్షణ తీసుకుంటోందని సమాచారం. అటు విన్ డీసిల్ కూడా దీపికాతో యాక్ట్ చేసేందుకు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. Yet another training session with @deepikapadukone for #XXX #thereturnofxandercage with @VinDieseI #trainhard pic.twitter.com/qwR6FJDpVZ — Yasmin Karachiwala (@YasminBodyImage) January 26, 2016
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement