ప్రలోభాలను పట్టేసుకుంటారు.. | Sakshi
Sakshi News home page

ప్రలోభాలను పట్టేసుకుంటారు..

Published Fri, Nov 10 2023 5:36 AM

ఫ్లయింగ్‌ వాహనంపై సీసీ కెమెరా - Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగదు, కానుకలు ఓటర్లకు చేరవేయకుండా ఉండేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పెద్ద ఎత్తున వాహనాల్లో గస్తీ చేపడుతుంది. అయితే ఇటీవల వీరి వాహనాలకు 360 డిగ్రీలు తిరుగుతూ రికార్డింగ్‌ చేసేలా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ వాహనానికి జీపీఎస్‌ కూడా ఉండటం, సీసీ కెమెరా పనితీరు మొత్తం ఎన్నికల కమిషన్‌కు అనుసంధానంగా ఉండటంతో వీరి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓటర్లకు పంచే నగదు, నగలు, కానుకలను గుర్తించడంతో పాటు వాటిని పట్టుకుంటుంది. పోలింగ్‌ జరిగేంత వరకు ఈ వాహనాలు నిరంతరం చక్కర్లు కొడుతూ నిఘా ఉంచుతాయి. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్‌, హాజీపూర్‌, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం వాహనాలు 24 గంటల పాటు నిఘాలో ఉంటున్నాయి.

Advertisement
Advertisement