Sakshi News home page

సమర్థవంతంగా పనిచేయాలి

Published Wed, Nov 15 2023 1:50 AM

- - Sakshi

కై లాస్‌నగర్‌: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు జీబీ పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోలీస్‌ పరిశీలకులు అశోక్‌ గోయల్‌తో కలిసి ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలు, అధి కా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు ఎదురైతే తెలుపాలన్నా రు. పోలింగ్‌స్టేషన్‌ పరిధిలో ఓటరు స్లిప్పులను ఓట ర్లందరికీ పంపిణి జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ అ మల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చే సే ప్రతీ ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాల ని ఆదేశించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 24/7 పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలతో పాటు సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పూర్తి నిఘాతో నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతీ ఓటరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తరలించాల్సిన స్టేషనరీ, ఎన్ని కల సామగ్రి, క్రమపద్ధతిలో పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు పరిశీలించుకోవాలని మహిళలు, దివ్యాంగులు, యువత కోసం మోడల్‌ కేంద్రాలను ఏర్పా టు చేయాలన్నారు. సెక్టార్‌, అసిస్టెంట్‌ ఎలక్షన్‌ రిట ర్నింగ్‌ అధికారులు, బీఎల్‌వోల సమన్వయంతో వందశాతం ఓటరు స్లిప్పులు సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలు కు బృందాలు అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్‌ వికాస్‌ మహతో,నోడల్‌అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల పరిశీలకులు జీబీ పాటిల్‌

ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష

Advertisement
Advertisement