చట్టాలపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Published Sun, Nov 19 2023 1:48 AM

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌
 - Sakshi

ఎదులాపురం: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి డాక్టర్‌ వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఉ న్నత పాఠశాల నం.2లో శనివారం న్యాయ వి జ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు, గృహహింస, బాలల హ క్కులు, పొక్సో తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్‌ పి.శివరామ్‌ ప్రసాద్‌, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నగేశ్‌, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలికల ఆశ్రమ పాఠశాలలో..

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాలి కల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు శనివా రం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారత, సఖి కేంద్రం ఆదిలాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ యశోద, జీసీడీవో చాయ, సఖి కేంద్రం సోషల్‌ కౌన్సెలర్‌ లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement