‘బీఆర్‌ఎస్‌కు ట్రస్మా మద్దతు’ | Sakshi
Sakshi News home page

‘బీఆర్‌ఎస్‌కు ట్రస్మా మద్దతు’

Published Mon, Nov 20 2023 11:34 PM

నగదు చూపుతున్న పోలీసులు
 - Sakshi

జన్నారం(ఖానాపూర్‌): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ట్రస్మా పూర్తి మద్ద తు ఇస్తుందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు తెలిపారు. సో మవారం కలమడుగులో విలేకరులతో మాట్లాడు తూ ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌, వివిధ సమస్యల పరిష్కారానికి పార్టీ హామి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఖానాపూర్‌ నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో 65 ప్రైవేట్‌ పాఠశాలలు, వెయ్యికి పైగా ఉపాధ్యాయులున్నారని, వారందర్నీ కలిసినట్లు తెలిపారు.

కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కేసు

ఆదిలాబాద్‌రూరల్‌: మావల పోలీస్‌స్టేషన్‌ పరిఽ దిలోని పలు కాలనీల్లో ఆదివారం రాత్రి 10గంటల అనంతరం దుకాణాలు తెరిచి ఉంచిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశామని, ఎవరైనా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

నగదు పట్టివేత

సిర్పూర్‌(టి): మండలంలోని పెద్దబండ సమీ పంలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో నగదు పట్టుబడినట్లు ఎస్సై డీకొండ రమేశ్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి గ్రామానికి చెందిన సాత్పతి రాజశేఖర్‌ మహా రాష్ట్రలోని రాజూరా నుంచి వేమనపల్లికి ఎలాంటి దృవపత్రాలు లేకుండా రూ.1,64,150 నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్‌ పాస్‌ పుస్తకాలు

మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): సీఐటీయూ పోరాట ఫలితంగానే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు సోమవారం సీఎంపీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ హరిపచౌరి పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి బి.మధు పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు సీఎంపీఎఫ్‌ పాస్‌ పుస్తకాలు అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులు వారికి సంబంధించిన పుస్తకాలను గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

లోకేశ్వరం: మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామ శివారులో పేకాటాడుతున్న ఐదుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురుని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ.11050 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మాట్లాడుతున్న శేఖర్‌రావు
1/1

మాట్లాడుతున్న శేఖర్‌రావు

Advertisement
Advertisement