’తుమ్మల’కు జాతీయ సాహితీ పురస్కారం | Sakshi
Sakshi News home page

’తుమ్మల’కు జాతీయ సాహితీ పురస్కారం

Published Mon, Nov 20 2023 11:34 PM

తుమ్మల దేవరావుకు పురస్కారం   అందిస్తున్న గోరటి వెంకన్న  - Sakshi

నిర్మల్‌ఖిల్లా: జాతీయ స్థాయిలో సాహిత్య రంగంలో కృషి చేస్తున్న వారికిచ్చే ‘విమల సాహి తీ సాహిత్య పురస్కారం’ నిర్మల్‌ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు, ఉపాధ్యాయుడు డాక్టర్‌ తుమ్మల దేవరావు అందుకున్నాడు. సోమవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్‌ భవన్‌లోని దొడ్డి కొమురయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి, తెలంగాణ శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న, రిటైర్డ్‌ వైస్‌ చాన్సలర్‌, ప్రముఖ రచయిత డా.కొలుకలూరి ఇనాక్‌, ప్రముఖ అనువాదకుడు ప్రొ. జీవీ.రత్నాకర్‌, ప్రముఖ కవి, వక్త డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు, కళాశ్రష్ట బిక్కి కృష్ణ, ప్రముఖ కవి, సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ జెల్ది విద్యాదర్‌, ప్రముఖ కవి డాక్టర్‌ దేవయ్య (కర్ణాటక) తదితరుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పురస్కార గ్రహీతల రచనలు ఇతర భాషల సాహిత్యంతో పోల్చలేనంత ఉన్నతంగా ఉన్నాయని కొనియాడారు. అయితే తుమ్మల దేవరావు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు. అనేక పరిశోధనా వ్యాసాలు రచించారు. కచ్చురం, గడ్డిపూలు, మట్టిపాదాలు, నిర్మల్‌ జిల్లా సాహిత్య చరిత్ర, నిర్మల్‌ కథలు తదితర పుస్తకాలు వెలువరించాడు. ఈ సందర్భంగా వీరిని నిర్మల్‌ సాహితీ మిత్రులు వైద్యుడు డాక్టర్‌ చక్రదారి, డాక్టర్‌ దామెరరాములు, పత్తి శివప్రసాద్‌, నేరెళ్ల హన్మంతు, రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement