ఎన్నికల అంశాలపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల అంశాలపై అవగాహన ఉండాలి

Published Mon, Nov 20 2023 11:34 PM

అవగాహన కల్పిస్తున్న సిబ్బంది, ఆర్‌వో రాహుల్‌  
 - Sakshi

బెల్లంపల్లి: ఎన్నికల ప్రతీ అంశంపై సెక్టోరల్‌ అధి కారులు అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి, జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఎన్నికల విధులపై సెక్టోరల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్‌ రోజున నిర్వర్తించాల్సిన విధులను సెక్టోరల్‌ అధికారులు తెలుసుకుని ఉండాలని అన్నారు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసే సౌకర్యాలపై సెక్టోరల్‌ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, లైట్లు, ఫ్యాన్లు, దివ్యాంగులు, వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ర్యాంపుల ఏర్పాటు, తాగునీరు, మూత్రశాలల ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్ల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి చర్యలపై అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై నమూనా యంత్రాల ద్వారా సెక్టోరల్‌ అధికారులకు అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement