‘రేవంత్‌ మాట నిలుపుకొన్నారు’ | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ మాట నిలుపుకొన్నారు’

Published Fri, Dec 8 2023 12:58 AM

స్తూపం వద్ద మాట్లాడుతున్న ఆదివాసీ నాయకులు
 - Sakshi

ఇంద్రవెల్లి: కొత్తగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి ఆదివాసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాయిసెంటర్‌ సార్‌మెడిలు మెస్రం వెంకట్‌రావ్‌, మెస్రం చిన్ను పటేల్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గతంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన దళిత, గిరిజన గర్జన సభలో స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చుదిద్దుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. స్తూపం అభివృద్ధికి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తొమ్మిది తెగల ఆదివాసీలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అలాగే 1981 ఘటనలో జరిగిన పోలీస్‌ కాల్పుల్లో మరణించిన కుటుంబాలు, గాయపడ్డ వారి కుటుంబీకులను గుర్తించి ఆదుకోవాలని, దీనిపై జిల్లా అధికారులు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు వెట్టి రాజేశ్వర్‌, మెస్రం నాగ్‌నాథ్‌, పెందోర్‌ గణేశ్‌, ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement