డాక్టర్‌ టాన్య సేవలు మరువలేనివి | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ టాన్య సేవలు మరువలేనివి

Published Fri, Dec 15 2023 1:14 AM

డాక్టర్‌ టాన్యా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వైద్యులు  - Sakshi

ఒంగోలు టౌన్‌: మహిళా ఉద్యమంలో నేతగా జిల్లాలో ఐద్వా నిర్మాణంలో కీలకపాత్ర వహించిన డాక్టర్‌ టాన్య నిబద్ధతతో ప్రజలకు వైద్య సేవలను అందించారని బేతూన్‌ నర్శింగ్‌ హోం వైద్యురాలు డాక్టర్‌ ఉదయిని అన్నారు. ప్రజా వైద్యురాలు టాన్య 82వ జయంతి సందర్భంగా గురువారం బేతూన్‌ నర్శింగ్‌ హోంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గత 12 ఏళ్లుగా నర్శింగ్‌ హోంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పట్ల మహిళల్లో అవగాహన కల్సిస్తున్నట్లు తెలిపారు. అనేక వైద్య పరీక్షలను నిర్వహించడమే కాకుండా వైద్య సలహాలు, మందులను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి టాన్య జీవితం నేటి తరం మహిళలకు ఆదర్శనీయమని చెప్పారు. జిల్లాలో డాక్టర్‌ రంగారావు, టాన్య దంపతులు ప్రజలకు వైద్య సేవలను అందించడమే కాకుండా సామాజిక చైతన్యం కలిగించేందకు కృషి చేశారన్నారు. క్యాన్సర్‌ బారిన పడిన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రతల గురించి ఎంఎన్‌ఆర్‌ క్యాన్సర్‌ వైద్యశాల డాక్టర్‌ రమణారెడ్డి వివరించారు. అనంతరం డాక్టర్‌ పురుషోత్తం టాన్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్యులు స్వాతి, కృష్ణకుమారి, కళ్యాణి వైద్య సేవలందించారు. ఐద్వా నాయకులు మాలతి, సీతామహాలక్ష్మి, ఎస్‌కే నాగూర్‌, రాజేశ్వరి, పద్మ, రమణమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
Advertisement