టూరిజంతో విజ్ఞానం, వినోదం | Sakshi
Sakshi News home page

టూరిజంతో విజ్ఞానం, వినోదం

Published Sun, Dec 24 2023 12:50 AM

 జిల్లా పర్యాటక శాఖ అధికారితో స్కై వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌: టూరిజంతో విజ్ఞానం, వినోదం కలుగుతాయని జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు అన్నారు. సంతసీతారంపురం స్కై వ్యవసాయ కళాశాలను శనివారం సందర్శించారు. అనంతరం అగ్రి టూరిజం క్లబ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పురాతన నిర్మాణాలు, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు ఇలా ప్రతీ అంశానికి పర్యాటకంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

విజ్ఞాన సందర్శనకు అనువుగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలను సైతం పర్యాటకంలో భాగం చేస్తున్నట్లు చెప్పారు. 135 ఎకరాల్లో ఉన్న స్కై వ్యవసాయ కళాశాలను అగ్రి టూరిజంగా గుర్తించి, క్లబ్‌ ప్రారంభించినట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్‌ వి.శ్రావని, వ్యవసాయ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement