‘దేశ భవిష్యత్‌ నిర్మాతలు విద్యార్థులే’ | Sakshi
Sakshi News home page

‘దేశ భవిష్యత్‌ నిర్మాతలు విద్యార్థులే’

Published Wed, Jan 31 2024 11:36 PM

మాట్లాడుతున్న కోఆర్డినేటర్‌ నారాయణ
 - Sakshi

మంచిర్యాలఅర్బన్‌: దేశ భవిష్యత్‌ నిర్మాతలు విద్యార్థులేనని కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఈసం నారాయణ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని వివేక వర్థిని డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక చైతన్యానికి, సంఘ సేవలో విద్యార్థి దశ నుంచే భాగస్వాములు కావాలన్నారు. తోటి వారికి సహాయపడేలా కేంద్ర ప్రభుత్వం 1969లో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించిందన్నారు. విద్యార్థులు తమ కళాశాల పరిధిలోని గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించేలా చొరవచూపాలన్నారు. పారిశుధ్యం, సంపూర్ణ అక్షరాస్యత, వయోజన విద్య, అంటువ్యాధులు, మూఢనమ్మకాలు, జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, మంచిర్యాల జిల్లా కన్వీనర్‌ డా.చంద్రమోహన్‌ గౌడ్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కన్వీనర్‌ తిరుపతి, నిర్మల్‌ జిల్లా కన్వీనర్‌ మురళి, ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement