విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి

Published Thu, Feb 22 2024 1:52 AM

బహుమతి ప్రదానం చేస్తున్న డీఈవో ప్రణీత - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈ వో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఫిజికల్‌ సైన్స్‌, బయోలజికల్‌ సైన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్‌ టెస్ట్‌ బుధవారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. నిత్యజీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మూఢనమ్మకాలు వీడి శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. కాగా పోటీల్లో బంగారుగూడ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి బి హర్షవర్ధన్‌ (ప్రథమ), అదే పాఠశాలకు చెందిన హరీష్‌ (ద్వితీయ), జైనథ్‌ మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన శివకన్య (తృతీయ), తాంసి జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలకు చెందిన బిందుజ నాలుగో స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో డైట్‌ వైస్‌ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌, ఫోరం సభ్యులు రవీంద్ర, చంద్రశేఖర్‌, పోచరెడ్డి, సత్యనారాయణ, రాఘవేందర్‌, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement