గంజాయి సాగు, రవాణా మానుకోవాలి | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:54 AM

పోలీసు స్టేషన్‌లో పాత ముద్దాయిలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ - Sakshi

పెదబయలు: గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ పులి మనోజ్‌కుమార్‌ చెప్పారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు గంజాయి తదితర కేసుల్లో పాత ముద్దాయిలకు కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల నుంచి గంజాయి కేసుల్లో పాత ముద్దాయిలను పిలిచించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరించారు.

గంజాయి కేసుల్లో ఇరుక్కోవడంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. పాత ముద్దాయిలపై బైండోవర్‌ కేసులున్నాయన్నారు. గంజాయి ముద్దాయిలుగా ఉన్న వారు మరలా గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ చెప్పారు. గ్రామాల్లో పరివర్తన కార్యక్రమం నిర్వహించి, గంజాయి, సారా అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో పరివర్తన వచ్చి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement
Advertisement