అర్హులకు ఆర్థిక చేయూత

29 Mar, 2023 01:24 IST|Sakshi
సీడీపీవో రమ్య

స్పాన్సర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

చింతపల్లిరూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ వాత్సల్య పథకం కింద స్పాన్సర్‌షిప్‌కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ సీడీపీవో రమ్య తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 18 సంవత్సరాలలోపు వయసు గల, రక్షణ,సంరక్షణ అవసరమైన వారి కనీస అవసరాలను తీర్చేందుకు ప్రతి నెలా ఆర్థిక చేయూత అందించటం జరుగుతుందన్నారు. ఆర్థిక, వైద్య,విద్య,అభివృద్ధి ఇతరత్రా అవసరాలను తీర్చేందుకు మిషన్‌ వాత్సల్య కింద షరతులతో కూడిన సహాయం అందిస్తారని, స్పాన్సర్‌షిప్‌కు ఎంపికై న పిల్లలకు నెలకు రూ.4 వేలు ఇస్తారని ఆమె తెలిపారు.ఏప్రిల్‌ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ విషయంపై ఎటువంటి సందేహాలు ఉన్నా చింతపల్లి ఐసీడీఎస్‌ కార్యలయాన్ని సందర్శించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు