21న అఖిలభారతఆదివాసీ సదస్సు | Sakshi
Sakshi News home page

21న అఖిలభారతఆదివాసీ సదస్సు

Published Fri, May 19 2023 6:08 AM

-

డాబాగార్డెన్స్‌: దేశంలోని వివిధ ప్రాంతాల్లో గిరిజనులపై పెరుగుతున్న దాడులు ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులతో ఈ నెల 21న విశాఖలో అఖిలభారత ఆదివాసీ సదస్సు నిర్వహించనున్నట్టు ఆదివాసీ జాతీయ సదస్సు నిర్వహణ కమిటీ ప్రతినిధులు కేదార్‌ సబర(ఒడిసా), డి సురేష్‌, ముక్తి సత్యం (తెలంగాణ) తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మా భూమి, జీవనోపాధిని, మా అస్థిత్వాన్ని కాపాడుకోవడం, విస్తాపన లేని అభివృద్ధిని, అడవులను రక్షించుకోవడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆదివాసీ సమూహాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సదస్సులో పలు తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. డాబాగార్డెన్స్‌లో గల అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిసా, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, బీహర్‌, యూపీ, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్‌ నుంచి ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు 750 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement