జాతీయస్థాయి తైక్వాండో సెలక్షన్లకు ముగ్గురు ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి తైక్వాండో సెలక్షన్లకు ముగ్గురు ఎంపిక

Published Mon, Nov 20 2023 1:18 AM

సల్లంగిపుట్టులో గంజాయి సాగు చేస్తున్న కొర్ర రాంబాబు  - Sakshi

మధుచందనకుఅభినందనలు

చింతూరు: ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థిని గుత్తుల మధుచందన రెండు కాంస్య పతకాలను సాధించింది. రాష్ట్రస్థాయి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగాయి. ఈ పోటీల్లో 81 ప్లస్‌ కేటగిరీలో పాల్గొన్న మధుచందన జూనియర్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల్లో కాంస్య పతకాలను సాధించింది. ఆమె పతకాలు సాధించడం పట్ల కోచ్‌ గోలి గంగాధర్‌తో పాటు కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినికి పలువురు అభినందనలు తెలిపారు.

గంజాయి నిందితుడికి రిమాండ్‌

పెదబయలు : పోయిపల్లి పంచాయతీ సల్లంగిపుట్టులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించడం జరిగిందని స్థానిక ఎస్‌ఐ పులి మనోజ్‌కుమార్‌ తెలిపారు. సల్లంగిపుట్టు గ్రామానికి చెందిన కొర్రా రాంబాబు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం అందడంతో వెళ్లి చూడగా గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్పాన్సెస్‌ యాక్ట్‌(ఎన్‌డీపీఎస్‌)కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. గంజాయి మొక్కల పెంపకం నేరమని, రెండేళ్ల నుంచి ఆపరేషన్‌ పరివర్తన ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, అయినా కొందరు రైతులు చట్టవ్యతిరేకంగా గంజాయి పండిస్తూ జైలు పాలవుతున్నారని తెలిపారు. రైతులు చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకుని సన్మార్గంలో నడవాలని కోరారు.

ఎస్‌.రాయవరం: మండలంలో అడ్డురోడ్డు త్వైకాండో క్లబ్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీ య స్థాయి సెలక్షన్స్‌కు ఎంపికై నట్టు కోచ్‌ చందు ఆదివారం తెలిపారు. ఈ నెల 18,19 తేదీల్లో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచినట్టు చెప్పారు. ఆర్‌.హసీనా, జ్యోత్నశ్రీ బంగారు పతకాలు, ఆర్‌.నందిని వెండిపతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు. క్రీడాకారులను కోచ్‌ చందుతో పాటు అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

మెడల్స్‌ సాధించిన క్రీడాకారులతో కోచ్‌ చందు
1/2

మెడల్స్‌ సాధించిన క్రీడాకారులతో కోచ్‌ చందు

పతకాలు సాధించిన మధుచందన
2/2

పతకాలు సాధించిన మధుచందన

Advertisement
Advertisement