ఘాట్‌లో విరిగిపడుతున్నకొండచరియలు | Sakshi
Sakshi News home page

ఘాట్‌లో విరిగిపడుతున్నకొండచరియలు

Published Thu, Dec 7 2023 1:10 AM

పాడేరు ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు  - Sakshi

రోడ్డుపై భారీగా వరద నీటి ప్రవాహం

వాహన రాకపోకలను నిలిపివేసిన

అధికారులు

సాక్షి,పాడేరు: భారీ వర్షాల కారణంగా పాడేరు ఘాట్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండవాగుల నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల రాకపోకలను ముందస్తుగానే నిలిపివేయాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ పోలీసుశాఖకు ఆదేశాలిచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి ఘాట్‌లో ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు. మైదాన ప్రాంతాల నుంచి పాడేరు వచ్చే వాహనాలను ఘాట్‌ దిగువున ఉన్న తాటిపర్తి ఎస్‌ఈబీ చెక్‌పోస్టు వద్ద ఆపేశారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహనాలను పాడేరుకు సమీపంలోని వంతాడపల్లి చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. కొండ చరియలు జారిపడుతున్న ప్రాంతాలను బుధవారం సాయంత్రం ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, సిబ్బంది పరిశీలించారు. గురువారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ, పోలీసుశాఖ కార్యాచరణ రూపొందించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement