అర్హులకు సహకార బ్యాంకుల రుణాలు | Sakshi
Sakshi News home page

అర్హులకు సహకార బ్యాంకుల రుణాలు

Published Mon, Dec 25 2023 1:54 AM

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆనందప్రసాద్‌ - Sakshi

ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆనంద ప్రసాద్‌

రావికమతం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రుణాలందించి చేనేత సొసైటీలను ఆదకోవాలని, వస్త్ర ఉత్పత్తికి అవసరమయ్యే ముడి సరుకులు, రంగు రసాయనాలు ఉచితంగా అందించాలని ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆనంద ప్రసాద్‌ అన్నారు.ఆ సంఘం రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం కొత్తకోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నిరుద్యోగంతో ఉన్న చేనేత కార్మికుల పిల్లలకు నూతన టెక్నాలజీతో కూడిన శిక్షణ ఇప్పించి ప్రభుత్వం ఉపాధి చూపాలన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని, వేతనాలు బ్యాంకుల ద్వారా త్వరితగతిన అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పుష్ప రాజారావు, ఏపి రాష్ట్ర అద్యక్షుడు శివరామ ప్రశాద్‌, కార్యదర్శి రమణ మహేష్‌, గౌరవాధ్యక్షుడు నాళి అప్పారావు, చేనేత విభాగం కార్యదర్శి పప్పు వెంకట రమణ పాల్గొని రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చి వివరించారు. చేనేత కార్మికులకు, రావికమతం మండలంలో టైలర్లకు సొసైటీల ద్వారా ఆప్కో సంబంధిత అధికారులతో చర్చించి 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు వచ్చేలా చూడాలని ఒక వినతి పత్రాన్ని మండల నాయకులు చల్లా సత్యారావు, బేతా రాజారావు, వైఎస్‌ఆర్‌సీపీ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు బేతా పాండు, శెలా నాగేశ్వరరావు సభలో అందించారు.

Advertisement
Advertisement