అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు

Published Mon, Apr 8 2024 1:35 AM

అవగాహన కల్పిస్తున్న రేంజ్‌ అధికారి కరుణాకర్‌   - Sakshi

పోక్సుపేట రేంజ్‌ అధికారి కరుణాకర్‌

రంపచోడవరం: అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అటవీశాఖ పోక్సుపేట రేంజ్‌ అధికారి ఎం.కరుణాకర్‌ తెలిపారు. అటవీ కార్చిచ్చు నివారణపై ఎర్రంపాలెం పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ తప్పిదాల వల్ల అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వీటి నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. డీఆలార్వో సుజాత, మాణిక్య, సుభద్ర, వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

గంగవరం : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని పోక్స్‌పేట ఫారెస్టు రేంజర్‌ ఆఫీసర్‌ ఎం. కరుణాకర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కుసుమరాయి, పిడతమామిడి, ఏటిపల్లి గ్రామాల్లో అటవీ శాఖ సిబ్బంది అడవుల్లో కార్చిచ్చుపై అటవీశాఖ సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన ర్యాలీలు, కళాజాతా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అటవీశాఖ సెక్షన్‌ అధికారులు నూకరాజు, అప్పారావు, ప్రశాంతకుమార్‌, బుల్లమ్మ, అప్పన్న దొర, జగదీష్‌ , మనోహర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement