ఆంగ్ల ఉపాధ్యాయినికిషోకాజ్‌ నోటీసు | Sakshi
Sakshi News home page

ఆంగ్ల ఉపాధ్యాయినికిషోకాజ్‌ నోటీసు

Published Sun, Mar 12 2023 7:06 AM

-

నర్సీపట్నం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆంగ్ల ఉపాధ్యాయినికి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. బలిఘట్టం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను శనివారం ఉదయం 8 గంటలకు డిప్యూటీ డీఈవో ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో పదో తరగతి విద్యార్థులకు స్ఫెషల్‌ క్లాస్‌ నిర్వహించాల్సిన ఉపాధ్యాయిని విధులకు హాజరు కాలేదు. దీంతో ఆయన చర్య తీసుకున్నారు. డిప్యూటీ డీఈవో విలేకరులతో మాట్లాడుతూ.. టెన్త్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జేసీ కల్పనాకుమారి ‘కృషి’ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాం రూపొందించి, 50 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రకారం ఉదయం 8 నుంచి 9.15 గంటల వరకు, సాయంత్రం 3.30 గంటల నుంచి 5.15 వరకు చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు తీసుకోవాలన్నారు. ఏ రోజు ఏ టీచర్‌ తరగతులు తీసుకోవాలన్నది టైంటేబుల్‌ వేశామన్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంగ్లిష్‌ టీచర్‌ కుమారి విధులకు రాకపోవడంతో షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్టు డిప్యూటీ డీఈవో తెలిపారు.

Advertisement
Advertisement