ఆధార్‌లో మార్పులు చేర్పులకు అవకాశం | Sakshi
Sakshi News home page

ఆధార్‌లో మార్పులు చేర్పులకు అవకాశం

Published Mon, Mar 20 2023 2:06 AM

-

తుమ్మపాల: ఆధార్‌కార్డులో ఉచితంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఎల్‌డీవో మంజులవాణి తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి జూన్‌ 14 వరకు మూడు నెలల పాటు ఎంఆధార్‌ మొబైల్‌ యాప్‌, myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చన్నారు. ఆధార్‌ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేసుకోని వారి ఆధార్‌ కార్డును ఈ ఏడాది ఆగస్టుతో రద్దు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకునేందుకు సచివాలయాల్లో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement