ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో యువతకు ఉపాధి | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో యువతకు ఉపాధి

Published Sat, Mar 25 2023 2:08 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి - Sakshi

తుమ్మపాల : జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో యువతకు ఉపాధి పెరిగి, గ్రామాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని కలెక్టర్‌ రవిపట్టాన్‌శెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 160 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 53 యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో గుర్తించిన 82 గ్రామాలలో ఫిష్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి మత్స్య సంయోజన పథకంలో భాగంగా యూనిట్‌ వ్యయంలో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కన్వర్జెన్సీ ఫండ్‌గా 30 శాతం మంజూరుకానున్నట్టు పేర్కొన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల నిర్మాణంతో మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి ప్రభాకరరావు, మత్స్యశాఖ అధికారి లక్ష్మణరావు, పశుసంవర్థక శాఖ జేడీ ప్రసాదరావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ, డీఆర్‌డీఏ ఏపీడీ డైసీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement