మాజీ హోంగార్డు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మాజీ హోంగార్డు ఆత్మహత్య

Published Tue, Sep 12 2023 12:44 AM

-

అనకాపల్లిటౌన్‌ : ఓ వ్యక్తి ఆదివారం రాత్రి బలవన్మరణం చెందాడు. పట్టణ హెచ్‌సీ రామకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గొల్లవీధికి చెందిన అప్పలరాజు(53) ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య జయలక్ష్మి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అప్పలరాజు పక్క గదిలోకి వెళ్లి ఉరిపోసుకొని మృతి చెందాడు. గతంలో మృతుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. సమయపాలన పాటించకపోవడంతో అప్పలరాజును విధుల నుంచి తొలగించారు. కొంతకాలంగా ఖాళీ ఉంటున్నాడు. ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ చెప్పారు.

Advertisement
Advertisement