రక్తహీనత నివారణే లక్ష్యం కావాలి | Sakshi
Sakshi News home page

రక్తహీనత నివారణే లక్ష్యం కావాలి

Published Fri, Nov 10 2023 5:36 AM

డీఈవో, డీఎంహెచ్‌వోలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి  - Sakshi

వజ్రగడలో పాఠశాలలను సందర్శించినకలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి

మాకవరపాలెం: విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా విద్య, వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి ఆదేశించారు. మండలంలోని వజ్రగడలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తరగతి గదుల్లో వసతులను తెలుసుకున్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను వేగవంతం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శివారెడ్డిని ఆదేశించారు. గ్రామం నుంచి ఉన్నత పాఠశాల వరకు 800 మీటర్ల మేర పొడవున రోడ్డుకు ప్రతిపాదనలు తయారు చేయాలని పీఆర్‌ జేఈ వెంకటేశ్వరరావుకు సూచించారు. ఉన్నత పాఠశాలలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌(ఐఎఫ్‌పీ) వెంటనే అమర్చి ఆంగ్ల బోధనను సమర్థంగా అమలు చేయాలని డీఈవో వెంకటలక్ష్మమ్మను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, రక్తహీనత నివారణకు ప్రణాళిక రూపొందించి జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సీతామహాలక్ష్మి, ఎంఈవోలు లక్ష్మి, మూర్తి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement