శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం | Sakshi
Sakshi News home page

శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం

Published Tue, Nov 14 2023 1:28 AM

-

మునగపాక: మండలంలోని ఉమ్మలాడ శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు ఎస్‌ఐ మహమ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు. ఉమ్మలాడ శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వీఆర్వో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ ఆలీకి ఫోన్‌లో సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆలీ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, శరీరంపై పసుపు రంగు ఫుల్‌షర్ట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించామని, వివరాల కోసం మునగపాక పోలీసు స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా ఎస్‌ఐ ఆలీ కోరారు.

Advertisement
Advertisement