అగ్రి సెట్‌లో అదరగొట్టారు | Sakshi
Sakshi News home page

అగ్రి సెట్‌లో అదరగొట్టారు

Published Thu, Nov 16 2023 1:04 AM

- - Sakshi

అనకాపల్లి టౌన్‌: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన అగ్రి సెట్‌–2023 ఫలితాలలో స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా వెబ్‌ ఆప్షన్స్‌తో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల(బాపట్ల, నైరా, ఉదయగిరి, రాజమహేంద్రవరం)లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం దక్కుతుందన్నారు. అగ్రిసెట్‌ ఫలితాల్లో జి.మధుమాలిక(6వ ర్యాంక్‌), బి.సృజన(17), బి.సాయివరప్రసాద్‌(28), ఎ.లీలా సత్యసాయి(39), కె.నాగలక్ష్మి(43), ఎం.దిలీప్‌(44), వై.వంశి(55), ఎం.ఝాన్సీ(60), కె.పద్మ(68), ఎస్‌.విజయలక్ష్మి(94), ఐ.మధుమాలిక(129), కె.రాహుల్‌(147) ర్యాంక్‌లు సాధించినట్లు వెల్లడించారు.

ఐ.మధుమాలిక
1/2

ఐ.మధుమాలిక

కె.రాహుల్‌
2/2

కె.రాహుల్‌

Advertisement
Advertisement