సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

Published Mon, Nov 20 2023 2:02 AM

-

అచ్యుతాపురం(అనకాపల్లి): సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా అచ్యుతాపురంలో సోమవారం నిర్వహించనున్న బహిరంగ ఏర్పాట్లను వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. యలమంచిలి నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర కార్యక్రమాలు, బహిరంగ సభ ప్రాంగణాలను వీరు పరిశీలించారు. శాసన మండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేశ్‌ బాబు, నవరత్నాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి నిజయోజక వర్గ సమన్వయ కర్త రొంగలి జగన్నాథం, జెడ్పీటీసీ లాలం రాంబాబు,కో ఆప్షన్‌ జెడ్పీటీసీ నర్మాల కుమార్‌, కోన లచ్చన్నాయుడు, దేశం శెట్టి శంకర్‌రావు పాల్గొన్నారు.

యాత్రను విజయవంతం చేయాలి

యలమంచిలి(అనకాపల్లి రూరల్‌): యలమంచిలి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సామాజిక బస్సు యాత్ర ఇంఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. యాత్ర ఏర్పాట్లను ఆయన ఆదివారం సమీక్షించారు. యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని పరిశీలించిన ఆయన స్థానిక పార్టీ నేతలతో బస్సు యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. బైక్‌ ర్యాలీకి ఎంతమంది పార్టీ కార్యకర్తలు రానున్నారో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్‌, పట్టణ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొరలతో చర్చించారు. అనంతరం బస్సు యాత్ర రూటు, షెడ్యూల్‌ గురించి చర్చించారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌బాబు, పార్టీ మండలాధ్యక్షుడు కొల్లి త్రినాథ్‌, పార్టీ నాయకుడు మర్రి రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement