మేలు జాతి పశువుల పెంపకాన్ని కృషి | Sakshi
Sakshi News home page

మేలు జాతి పశువుల పెంపకాన్ని కృషి

Published Sat, Nov 25 2023 1:48 AM

పోటీలకు తీసుకువచ్చిన లేగదూడలను పరిశీలిస్తున్న ప్రసాదరావు  - Sakshi

● పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కరుణాకరరావు, జిల్లా పశువైద్యాదికారి ప్రసాదరావు.

కె.కోటపాడు: మేలు జాతి పశువుల పెంపకానికి పాడిరైతులు కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కరుణాకరరావు, అనకాపల్లి జిల్లా పశువైద్యాధికారి బి.ప్రసాదరావు తెలిపారు. చౌడువాడలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏడాది లోపు లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. 45 పెయ్యిలను వాటి పెంపకందారులు ప్రదర్శనకు తీసుకువచ్చారు. వీటిలో ఆరోగ్యకరమైన పశుపోషణ కలిగి మొదటి మూడు స్థానాలలో నిలిచిన పెయ్యిల పెంపకందారులకు బహుమతులను అందించారు. వీటితో పాటు ప్రదర్శనకు తీసుకువచ్చిన పెయ్యిల పెంపకం దారులకు కన్స్‌లేషన్‌ బహుమతులను కరుణాకరరావు, ప్రసాదరావు అందించారు. ఈ సందర్బంగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థకార్యనిర్వహణాదికారి బి.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని 30 ప్రాంతాల్లో ఈ ఏడాది లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.బైరాగి మాట్లాడుతు రైతులకు 60 శాతం రాయితీపై టీఎంఆర్‌ దాణాను అందిస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు సంధ్య, సీహెచ్‌.వై.నాయుడు, మౌనిక, వైస్‌ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, సర్పంచ్‌ దాడి ఎరుకునాయుడు, పాల సంఘం అధ్యక్షుడు కోమార వెంకటరమణ, మాజీ గోవాడ సుగర్‌ ప్యాక్టరీ డైరక్టర్‌ రాజి శ్రీనివాసరావు, ఆళ్ళ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement