8న మునగపాక పీఏసీఎస్‌ శత వార్షికోత్సవం | Sakshi
Sakshi News home page

8న మునగపాక పీఏసీఎస్‌ శత వార్షికోత్సవం

Published Sun, Dec 3 2023 1:42 AM

శత వార్షికోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తిరాజు  - Sakshi

● పోస్టర్‌ విడుదల చేసిన ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

మునగపాక: రైతుల భాగస్వామ్యంతో ఈ నెల 8న జరగనున్న మునగపాక పీఏసీఎస్‌ శత వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునగపాక పీఏసీఏస్‌ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా పాలకవర్గం ఆధ్వర్యంలో వార్షికోత్సవానికి సన్నద్ధం కావడం అభినందనీయమన్నారు. పీఏసీఏస్‌ల అభివృద్ధికి ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కోనపల్లి రామ్మోహనరావు, ఎంపీటీసీ సూరిశెట్టి రాము, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ పిల్లి కనకలక్ష్మి అప్పారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement