17న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

17న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు

Published Sun, Dec 3 2023 1:42 AM

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు  - Sakshi

అనకాపల్లి టౌన్‌: స్థానిక వి.వి.రమణ రైతుభారతి ఆడిటోరియంలో ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు మిస్టర్‌ ఆంధ్రా–2023 రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ది అనకాపల్లి బాడీ బిల్డర్స్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శిలపరశెట్టి బాబి తెలిపారు. స్థానిక రైతుభారతి ఆడిటోరియంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ విన్నర్‌గా రూ.25 వేలు, రన్నర్‌గా రూ.10 వేలతోపాటు 55 నుంచి 85 కేజీల విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులుగా రూ.4 వేలు, రూ.3 వేలు, రూ. 2వేలు, వెయ్యి రూపాయలతోపాటు షీల్డ్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అమరపల్లి కృష్ణాజీ మాట్లాడుతూ గతంలో విశాఖ జిల్లాలో క్రీడలు నిర్వహించేవారమని, కొత్త జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాపోటీల గోడపత్రికను వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కోశాధికారి మళ్ల రామచంద్రరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement