పెరిగిన కోనాం జలాశయ నీటిమట్టం | Sakshi
Sakshi News home page

పెరిగిన కోనాం జలాశయ నీటిమట్టం

Published Sat, Dec 9 2023 4:58 AM

జలాశయ గర్భం - Sakshi

● భారీగా చేరుతున్న ఇన్‌ఫ్లో

చీడికాడ: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో మండలంలోని కోనాం జలాశయ నీటి మట్టం 5 రోజుల వ్యవధిలో 10 మీటర్లు పెరిగి, శుక్రవారం సాయంత్రానికి 99 మీటర్లకు చేరింది. జలాశయ గరిష్ట నీటిమట్టం 101.25 మీటర్లు. జలాశయంలోకి వస్తున్న ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు ఉండడంతో ఆదివారం నాటికి ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉంది. 100 మీటర్లు దాటే వరకు నీటిని నిల్వ చేసి తదనంతర పరిస్థితి ఆధారంగా నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ జయరాం తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు డెడ్‌ స్టోరేజీకి దగ్గరగా చేరుతోందనుకున్న జలాశయ నీటి మట్టం, తుపాను వర్షాల ధాటికి పూర్తిస్థాయికి చేరుకోవడంతో రైతుల్లో రబీ ఆశలు చిగురించాయి.

Advertisement
Advertisement