వడ్డాది వంతెనపై రాకపోకల పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

వడ్డాది వంతెనపై రాకపోకల పునరుద్ధరణ

Published Tue, Dec 12 2023 1:28 AM

వడ్డాది వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలు  - Sakshi

బుచ్చెయ్యపేట: భీమునిపట్నం– నర్సీపట్నం(బీఎన్‌) రోడ్డులో వడ్డాది వంతెనపై రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరించారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలకు పెద్దేరు నది ఉధృతంగా ప్రవహించడంతో ఈ నెల 5వ తేదీన ఇక్కడ వంతెన దెబ్బతింది. డైవర్షన్‌ రోడ్డు పూర్తిగా మునిగిపోగా, వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, కలెక్టర్‌ రవి పటాన్‌శెట్టి వెంటనే మరమ్మతులు చేపట్టి రవాణా సదుపాయం కల్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన రాళ్లు, గ్రావెల్‌ వేసి తాత్కాలికంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వెళ్లేలా రవాణా సదుపాయం కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి బస్సులు, లారీలు వెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement