ముగిసిన వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌

Published Wed, Dec 20 2023 1:36 AM

-

పీఎంపాలెం: బక్కన్నపాలెం ఏపీఎస్‌పీ 16వ బెటాలియన్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో గత రెండు రోజలుగా జరుగుతున్న ఏడో వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. 16వ బెటాలియన్‌ కమాండెంట్‌ గౌతమీ శాలిని పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో పోలీస్‌ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న పోలీస్‌ క్రీడాకారులను డిపార్టుమెంట్‌ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి.శామ్యూల్‌ జాన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement