Sakshi News home page

పలు రైళ్ల దారి మళ్లింపు

Published Mon, Dec 25 2023 1:56 AM

- - Sakshi

తాటిచెట్లపాలెం: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ డివిజన్‌, కాజీపేట–బల్హార్షా సెక్షన్‌ హసన్‌పర్తి రోడ్‌–ఉప్పల్‌ స్టేషన్‌ల మధ్య జరుగుతున్న ఆదునికీకరణ పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈ కింది రైళ్లు దువ్వాడ–విజయవాడ–వరంగల్‌–బల్హార్షా మీదుగా కాకుండా మళ్లించిన మార్గంలో వయా విజయనగరం–రాయగడ– టిట్లాఘడ్‌– రాయ్‌పూర్‌– నాగ్‌పూర్‌ మీదుగా నడుస్తాయి.

● జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం–న్యూఢిల్లీ –విశాఖపట్నం (20805/20806) ఏపీ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 4, 11 తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 7న గాంధీదాం–విశాఖపట్నం(20804) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 1, 5, 8, 12 తేదీల్లో విశాఖపట్నం–హజరత్‌ నిజాముద్దీన్‌ (12803) స్వర్ణజయంతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 3, 7, 10 తేదీల్లో హజరత్‌ నిజాముద్దీన్‌–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 7న పూరీ –ఓఖా(20819) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

● జనవరి 3,10 తేదీలలో ఓఖా–పూరీ (20820) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు.

కోరాపుట్‌–రాయగడ్‌ లైన్‌లో..

వాల్తేర్‌ డివిజన్‌ దమన్‌జోడి–బాయ్‌గుడ స్టేషన్‌ల మధ్య జరుగుతున్న రెండో లైన్‌ సంబంధిత పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు తెలిపారు. జనవరి 1,5 తేదీల్లో విశాఖపట్నం–కోరాపుట్‌(18512) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, జనవరి 2,6 తేదీల్లో కోరాపుట్‌–విశాఖపట్నం(18511) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దయ్యాయి.

Advertisement
Advertisement