కొత్తకోటలో ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు | Sakshi
Sakshi News home page

కొత్తకోటలో ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు

Published Mon, Mar 18 2024 1:10 AM

నూకాంబిక ఆలయానికి ఘటాలతో బయలుదేరిన మహిళలు  - Sakshi

రావికమతం : కొత్తకోట గ్రామంలో శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయ 10వ వార్షికోత్స వం ఆదివారం ఘనంగా జరిగింది. ఊరూ వాడ ఏకమై ఇంటికో ఘటంతో డప్పుల వాయిద్యాలతో వేలాదిగా మహిళలు తరలివచ్చారు. సంబరాన్ని చూసేందుకు జనాలు తరలిరావడంతో రోడ్లు కిక్కిరిసాయి. అమ్మవారికి ఘనంగా సారె సమర్పించి ఆపై భారీ అన్నసమారా ధన నిర్వహించారు. అలాగే గ్రా మంలో భక్తాంజనేయ స్వామివారి ఆల య 30వ వార్షికోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement