అట్టహాసంగా ముత్యాల నాయుడు నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ముత్యాల నాయుడు నామినేషన్‌

Published Tue, Apr 23 2024 8:40 AM

నామినేషన్‌కు ర్యాలీగా వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు  - Sakshi

తుమ్మపాల: వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నామినేషన్‌ కార్యక్రమం సోమ వారం అట్టహాసంగా జరిగింది. దేవరాపల్లి మండలం తారువ గ్రామం నుంచి ఆయన ఉదయం 11 గంటల సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. 45 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమాను లు స్వాగతం పలుకుతూ సీఎం జగన్‌, ఎంపీ బూడి అంటూ నీరాజనాలు పలికారు. అనకాపల్లి పట్టణంలో ఎంపీ బీవీ సత్యవతి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగ తం పలికారు. అక్కడ నుంచి జాతీయ రహదారి మీదు గా శంకరంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. 1.45 నిమిషాలకు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను అఫిడవిట్‌ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌శెట్టికి సమర్పించారు. నామినేషన్‌ వేసి బయటకు వచ్చిన బూడిని జిల్లాలో పలువురు నాయకులు సత్కరించి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. అనంతరం మీడియాతో బూడి మాట్లాడుతూ.... మాడుగుల నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవడంతోపాటు వైఎస్సార్‌సీపీ కంచుకోటగా తయారు చేశామన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలను అదే విధంగా అభివృద్ధి చే యాలని ఆయా నియోజకవర్గాల ప్రజ లు, నాయకులు కోరుతున్నారన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంపీగా తనతోపాటు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

సీఎం.రమేష్‌కు ఢిల్లీ వీధులు బాగా తెలుసట....

టీడీపీ అధినేత చంద్రబాబు కడప నుంచి దిగుమతి చేసిన సీఎం.రమేష్‌కు ఢిల్లీలో అన్ని వీధులు తెలుసని, తనకు తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్ప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచిన వ్యక్తికి తెలియాల్సింది ఢి ల్లీ వీదులు కాదని, పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వీధులు, గ్రామాలు తెలియాలన్నారు. ఈ ప్రాంత సమస్యలపై కనీస అవగాహన లేని రమేష్‌కు ఇక్కడ పనేంటన్నారు. సీఎం ఆశీస్సు లు, ప్రజల దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో తనకు కేటాయించిన క్యార్టర్స్‌ నుంచి పార్లమెంట్‌కు వెళ్తాను తప్ప ఢిల్లీ వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలదె పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారం దిశగా పనిచేస్తామన్నారు.

మూడు సెట్ల దాఖలు చేసిన బూడి ముత్యాలనాయుడు

తారువ నుంచి కలెక్టరేట్‌కు వరకు 45 కిలోమీటర్ల ర్యాలీ

దారి పొడవునా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు

ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement