జగన్‌మోహన్‌రెడ్డికి జనం జేజేలు | Sakshi
Sakshi News home page

జగన్‌మోహన్‌రెడ్డికి జనం జేజేలు

Published Sat, Nov 11 2023 1:22 AM

- - Sakshi

అనంతపురం కార్పొరేషన్‌: ఏపీలో సంక్షేమ విప్లవం సాగించిన జగనన్న పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం జిల్లాలో ఊపందుకుంది. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించి, వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి గత ప్రభుత్వంలో చంద్రబాబు నయవంచక పాలన, ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన గురించి తెలియజేశారు. జగన్‌ పాలనకు జనం జేజేలు పలుకుతూ ‘ప్రజా తీర్పు’ పుస్తకంలో అత్యధిక మార్కులిస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమం జరిగిన ప్రాంతంలో గ్రామ పెద్దలతో కలసి భోజనం చేశారు. స్థానిక సమస్యలు, పరిష్కార చర్యలపై చర్చించారు.

● కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని ఒంటిమిద్ది గ్రామంలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాల కన్నా ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితరుల ఆర్థిక స్థితిగతులను సీఎం జగన్‌ మెరుగుపర్చారన్నారు.

● రాయదుర్గం నియోజకవర్గంలో గమ్మఘట్ట, 75 వీరాపురం, ఉడేగోళం, రాయదుర్గం పట్టణం కొలిమి వీధిలో జరిగిన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. గత చంద్రబాబు పాలనకు ప్రస్తుత జగన్‌ పాలనకు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్లాలంటే మరోసారి సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండాలన్నారు.

● ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా ఈ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎవ్వరూ చేపట్టలేదన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

● శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కల్లూరులో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, రాజకీయ, ఉపాధి తదితర వాటిలో న్యాయం జరగడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక చర్యలేనన్నారు. ఆ సువర్ణపాలన కొనసాగాలంటే మరోమారు ఏపీ సీఎంగా జగన్‌ ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పాల్గొన్నారు.

● అనంతపురం అర్బన్‌ ఎర్రనేలకొట్టాలలోని 2వ సచివాలయం, వినాయకనగర్‌లోని 3వ సచివాలయంలో జరిగిన కార్యక్రమాన్ని మేయర్‌ వసీం ప్రారంభించారు.

ఏపీలో పాలన దేశానికే ఆదర్శం

సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌

జిల్లాలో ఊపందుకున్న ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

1/1

Advertisement
Advertisement