బైపాస్‌ నిర్మాణానికి భూసేకరణ వేగవంతం | Sakshi
Sakshi News home page

బైపాస్‌ నిర్మాణానికి భూసేకరణ వేగవంతం

Published Wed, Nov 15 2023 12:18 AM

మ్యాప్‌ను పరిశీలిస్తున్న జేసీ కేతన్‌ గార్గ్‌   - Sakshi

రాయదుర్గం రూరల్‌: మండలంలోని 74 ఉడేగోళం వద్ద ఉన్న వైఎస్సార్‌ క్రాస్‌ నుంచి కణేకల్లు రోడ్డు మీదుగా బళ్లారి రోడ్డును కలుపుతూ నిర్మించ తలపెట్టిన బైపాస్‌కు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూములను ఆర్డీఓ రాణి సుస్మితతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు. బైపాస్‌ నిర్మాణం పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయన్నారు. ఆర్‌అండ్‌బీ డీఈ రవిశంకర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఓబులేసు పాల్గొన్నారు.

Advertisement
Advertisement